Purushaha: ‘పురుష:’లో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం, అంచనాలు పెంచిన డైరెక్టర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్న సినిమా ‘పురుష:’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర దర్శకుడు వీరు వులవల మీడియాతో పంచుకున్న విశేషాలు ఇప్పుడు చూద్దాం..

News18
News18

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర దర్శకుడు వీరు వులవల మీడియాతో పంచుకున్న విశేషాలివే..

మీ నేపథ్యం గురించి చెప్పండి? నాకు పెయింటింగ్స్ వేయడం అలవాటు. చిన్నప్పుడు హీరోల బొమ్మల్ని క్లాత్ మీద పెయింటింగ్ వేసేవాడ్ని. వాటిని థియేటర్ల ముందు అందరూ కట్టుకునేవారు. ఆ తరువాత బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఏ పని చేసినా సరే నేను ఇండస్ట్రీలోనే ఉండాలని అనుకున్నాను. ఆ టైంలోనే ‘కొత్త బంగారు లోకం’ టైటిల్‌ను రాసి, డిజైన్ చేశాను. అలా నేను ఇప్పటికీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలా మంది హీరోలకు కలిపి 350కి పైగా టైటిల్స్‌ని రాసి, డిజైన్ చేశాను.

నిర్మాతను ఎలా ఒప్పించారు? ఆయన కథ విన్న తరువాత ఏం చెప్పారు? ఈ కథను పట్టుకుని తిరుగుతున్న టైంలో ‘మసూద’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసే అవకాశం వచ్చింది. అది కూడా మంచి విజయం సాధించింది. ఒక మూడు నెలలు చాలా సీరియస్‌గా వర్క్ చేశాను. ఎంతో మందికి కథను వినిపించాను. అప్పుడు ఓ సారి కోటేశ్వరరావు గారి వద్దకు కథ వెళ్లి ఆగింది. గోవింద్ (పవన్ కళ్యాణ్), కమల (రాయంచ) ప్రేమ కథ మెయిన్ పాయింట్. కాకపోతే సపోర్టింగ్ పాత్రలు ఎక్కువగా ఉంటాయని కోటేశ్వరరావు గారికి చెప్పాను. ఆ కథను విన్న తరువాత ఆయనకు చాలా నచ్చింది. ఇలాంటి సినిమా అయితేనే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి మా అబ్బాయి రీచ్ అవుతాడని కోటేశ్వరరావు గారు అనుకుని ఓకే చెప్పారు.

నిర్మాత గారి సపోర్ట్ గురించి చెప్పండి? నిర్మాత కోటేశ్వరరావు గారు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క విషయంలో మమ్మల్ని ప్రశ్నించలేదు. ప్రతీ ఒక్క స్టేజ్‌లో మా అందరినీ ప్రోత్సహించారు. ఆయన కూతురు సరస్వతి గారు అయితే ప్రతీ రోజూ సెట్‌లో మా అందరినీ ఎంతో చక్కగా చూసుకున్నారు. వీరిద్దరి సపోర్ట్‌తోనే సినిమాని ఇంత బాగా తీయగలిగాను. సినిమా చూసిన తరువాత కోటేశ్వరరావు గారు నన్ను పట్టుకుని ఏడ్చేశారు. ఇది నా 26 ఏళ్ల కల అని కన్నీరు పెట్టుకున్నారు.

‘పురుష:’లోని పాత్రలు ఎలా ఉంటాయి? ప్రేమ కోసం ఏమైనా చేసే ఓ మంచి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. సప్తగిరి, కసిరెడ్డి పాత్రలు అందరినీ ఎంటర్టైన్ చేస్తాయి. మరీ ముఖ్యంగా కసిరెడ్డి పాత్ర కోసం రాసిన డైలాగ్స్ ఎక్కువగా అలరిస్తాయి. వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, వెన్నెల కిషోర్ గారు చాలా పాత్రలుంటాయి. ప్రతీ ఒక్క కారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ గారితో కిటికీ వద్ద ఉండే ఎపిసోడ్‌కి థియేటర్లో అందరూ పగలబడి నవ్వేస్తారు. ఆ సర్ ప్రైజ్ మూమెంట్ ఏంటో మీకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఆ కిటికీ ఎపిసోడ్ సినిమాకి హైలెట్.

‘పురుష:’ కథ ఎలా పుట్టుకొచ్చింది? నేను అవకాశాల కోసం చాలా చోట్ల తిరిగాను. అయితే గౌతమ్ తిన్ననూరి గారి ‘మళ్లీరావా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆ సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌కి డ్రాయింగ్ వేశాను. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత గౌతమ్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. ‘జెర్సీ’కి కూడా నేను పని చేశాను. ‘జెర్సీ’ మూవీకి పని చేస్తున్న టైంలోనే ఈ ‘పురుష:’ పాయింట్ తట్టింది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే పాయింట్‌తో ముందు కథను స్టార్ట్ చేశాను.

‘పురుష:’ ఎలా ఉండబోతోంది? భార్యాభర్తల మీదే స్టోరీని రాయాలని అనుకున్నాను. అయితే ఫీమేల్ ఓరియెంటెడ్ కథలెన్నో మనం చూశాం. కానీ ఇది మేల్ ఓరియెంటెడ్‌గా తీయాలని అనుకున్నాను. ఇలాంటి జానర్ ఒకటి ఉందా? అని అనుకున్నాను. అలా కథ పూర్తి చేశాను. ఈ కథను చాలా మందికి వినిపించాను. ప్రతీ రిజెక్షన్‌తో కథలో ఒక్కో డెవలప్మెంట్ చేశాను. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుంది.

వెంటనే షూటింగ్‌ని స్టార్ట్ చేశారా? లేదా ఏమైనా వర్క్ షాప్స్ నిర్వహించారా? పవన్ కళ్యాణ్ కొత్త ఆర్టిస్ట్. సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకున్నారు. అయితే వెంటనే షూటింగ్‌కి వెళ్లలేదు. ఓ రెండు నెలల పాటుగా వర్క్ షాప్స్ నిర్వహించాం. ఆ తరువాతే షూటింగ్‌కి వెళ్లాం. 51 రోజుల పాటు చిత్రీకరించాం. కాకినాడలోనే ఎక్కువగా సినిమాని షూట్ చేశాం.

‘పురుష:’ టెక్నికల్ టీం గురించి చెప్పండి? కెమెరామెన్ సతీష్ గారి వల్లే నిర్మాత పరిచయం అయ్యారు. ఆయనతో నాకు ‘మళ్లీరావా’ నుంచే పరిచయం. నేచురల్ లొకేషన్స్‌లోనే దాదాపుగా షూటింగ్ చేశాం. ఇందులో ఆరు పాటలుంటాయి. ప్రతీ పాట చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ‘మళ్లీరావా’ నుంచీ నాకు మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారు పరిచయం. మంచి పాటలతో పాటుగా, అద్భుతమైన ఆర్ఆర్ కూడా ఇచ్చారు. అందరూ నాకు గొప్పగా సహకరించారు.

‘పురుష:’ గురించి ఫైనల్‌గా చెప్పండి? ప్రస్తుతం నా వద్ద యాక్షన్, ఫ్యాంటసీ, థ్రిల్లర్ జానర్లలో కథలు రెడీగా ఉన్నాయి. ఈ సినిమాలోనూ కొన్ని చోట్ల హరర్, థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని వర్గాల ఆడియెన్స్‌‌ని ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports