ఆ సమయంలో హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన కొందరు అగ్ర హీరోలు లేదా రాయల్ ఫ్యామిలీస్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టార్ల పేర్లను నెటిజన్లు ఊహిస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి ఎక్కడా ఏ ఒక్క హీరో పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి ఇలా సరదాగా వ్యాఖ్యానించినప్పటికీ, చిత్ర పరిశ్రమతో ఆయనకు అత్యంత బలమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి దిగ్గజాలు ఆయనను స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, ఇండస్ట్రీ సమస్యలు, తెలంగాణలో షూటింగుల అనుమతుల విషయంలో రేవంత్ సర్కార్ ఎంతో సానుకూలంగా స్పందిస్తోంది.













