Last Updated:
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన కొత్త సినిమా లెనిన్. నేడే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? దీనిపై సోషల్ మీడియా టాక్ ఎలా ఉందనేది చూద్దామా..
అక్కినేని నట వారసుడిగా ఎంతో గ్రాండ్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్, సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ‘సిసింద్రీ’గా బాలనటుడిగానే ప్రేక్షకుల మనసు దోచుకున్న అఖిల్, ‘మనం’ సినిమాలో క్యామియోతో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య తన పేరుతోనే ‘అఖిల్’ అనే చిత్రాన్ని చేసి హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలు కూడా కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాస్త ఊరటనిచ్చినా, ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ‘ఏజెంట్’ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో, తన కెరీర్‌ను మలుపు తిప్పే ఒక సాలిడ్ హిట్ కోసం అఖిల్ ఇప్పుడు ‘లెనిన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు జులై 10న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అక్కినేని నాగార్జున, నిర్మాత నాగవంశీ, స్వయంగా అఖిల్ సైతం సినిమా ఔట్‌పుట్ పట్ల అత్యంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే లెనిన్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఈ సినిమా ఎలా ఉందో పేర్కొంటూ ట్విట్టర్ (X) వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు.
#Lenin Template Commercial Film with a Few Interesting Twists!
Decent intro with a setup drawing parallels to the Mahabharatham. However, the film soon turns flat with an ineffective love story and tried and tested commercial beats. The film picks up from the pre-interval, and…
— Venky Reviews (@venkyreviews) July 10, 2026
సినిమా ప్రారంభం ఎంతో బలంగా మొదలవుతుందని, ఆసక్తికరమైన పాత్రలు, ముఖ్యంగా జూనియర్‌ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మొదటి నుంచే ప్రేక్షకులను సినిమాకు కనెక్ట్ చేస్తుందని చెబుతున్నారు. అయితే, సినిమా రన్ అవుతున్నా కొద్దీ కథనం కాస్త నెమ్మదిస్తుందని, చిత్రంలోని ప్రేమకథ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని అంటున్నారు. మంచి అవకాశమున్నప్పటికీ, ఎమోషనల్ డ్రామా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని పేర్కొంటున్నారు.
ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా మళ్లీ ఊపందుకుంటుందని, ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై ప్రేక్షకుల్లో నిజమైన ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాలో గ్రామీణ వాతావరణం, కుటుంబ భావోద్వేగాలు, మాస్ సీన్స్ అన్నీ ఉన్నాయని అంటున్నారు. అఖిల్, భాగ్య శ్రీ కెమిస్ట్రీ బాగా కుదిరిందని, ఈ సినిమా అఖిల్ కెరీర్ లో ప్రత్యేకం అయ్యే ఛాన్స్ అయితే ఉందని అంటున్నారు ఆడియన్స్.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














