Karthika Deepam Serial Today July 12th Review: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం 2’ సీరియల్ ఈ వారం సరికొత్త క్యారెక్టర్ల ఎంట్రీతో మరింత ఆసక్తికరంగా మారింది. జూలై 6 నుండి జూలై 11 వరకు ప్రసారమైన ఎపిసోడ్లలో కథ ఊహించని మలుపులు తిరిగింది. జ్యోత్స్న నిర్లక్ష్యం వల్ల శివన్నారాయణ చేత సూరజ్ దెబ్బతినడం, మరోవైపు బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ‘మాలిని’ అనే పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ ఇవ్వడం ఈ వారానికి ప్రధాన హైలైట్స్‌గా నిలిచాయి. దక్షిణామూర్తి, శివన్నారాయణల మధ్య శత్రుత్వం గుడి వరకు పాకడం.. అదే సమయంలో దక్షిణామూర్తి తన కోడలిగా మాలినిని కార్తీక్ కుటుంబానికి పరిచయం చేయడం కథను మరింత రసవత్తరంగా మార్చింది. ఒకవైపు జ్యోత్స్న, సూరజ్ ల మధ్య సాగుతున్న మైండ్ గేమ్స్, మరోవైపు దీపకు మాలిని ఇచ్చిన జాబ్ ఆఫర్‌తో ఈ వారం ఎపిసోడ్లు ఉత్కంఠభరితంగా సాగాయి. (Photo Credit: karthika deepam serial Star maa / Disney + Hotstar)














