Last Updated:
అక్కినేని నాగ చైతన్య తన కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త జోనర్‌ను ఎంచుకుని ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన చేస్తున్న ‘విరూపాక్ష’ మూవీ నుంచి కీలక అప్ డేట్ బయటకొచ్చింది.
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య తన కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త జోనర్‌ను ఎంచుకుని ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘విరూపాక్ష’ వంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీ బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్లో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma). భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మైథికల్ థ్రిల్లర్ సినిమాకు సంబంధించి చిత్రబృందం తాజాగా ఒక కీలకమైన అప్డేట్ను పంచుకుంది.
ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన టాక్ పార్ట్, యాక్షన్ షెడ్యూల్‌ను రాజస్థాన్‌లోని పాత కోటలు, ఎడారి ప్రాంతాలలో విజయవంతంగా పూర్తి చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ షెడ్యూల్‌తో టాక్ పార్ట్ చిత్రీకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా నడిపిస్తున్నారు. భారతీయ వెండితెరపై ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్‌ను ఆవిష్కరించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ విఎఫ్ఎక్స్ (VFX) పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నాగచైతన్య సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ (SVCC) పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కు చెందిన ‘సుకుమార్ రైటింగ్స్’ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మైథికల్, సోషియో-ఫాంటసీ చిత్రాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు కార్తీక్ దండు ‘వృషకర్మ’ స్క్రిప్ట్‌ను ఎంతో ఇంటెన్స్‌గా సిద్ధం చేశారు. రాహుల్ డి హెరియన్ అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీ నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ‘తండేల్’ వంటి విలక్షణమైన సినిమా తర్వాత నాగచైతన్య నటిస్తున్న ఈ హై-కాన్సెప్ట్ మూవీ అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













