Sonam Wangchuk: జంతర్‌మంతర్ దగ్గర వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు | | ACTPnews

సోనమ్ వాంగ్ చుక్ (File Image - PTI)


Last Updated:

Sonam Wangchuk: ఇప్పుడు జంతర్‌మంతర్ దగ్గర వాంగ్‌చుక్ మద్దతుదారులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఈ దీక్షకు కారణం నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండే.

సోనమ్ వాంగ్ చుక్ (File Image - PTI)
సోనమ్ వాంగ్ చుక్ (File Image – PTI)

ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ని పోలీసులు.. ఆస్పత్రికి తరలించారు. ఆయన దీక్షను భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు జంతర్‌మంతర్ దగ్గర వాంగ్‌చుక్ మద్దతుదారులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఈ దీక్షకు కారణం నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండే. కానీ కేంద్రం ఈ దిశగా ఆలోచన చెయ్యట్లేదు.

కాక్రోజ్ జనతా పార్టీ మద్దతుదారులు.. ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్ని కూడా అడ్డుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతం అల్లకల్లోలం.. ఏపీ, తెలంగాణకు 6 రోజులు వర్ష సూచన.!

వాంగ్‌చుక్.. పర్యావరణాన్ని కాపాడే వాతావరణ కార్యకర్త, విద్యా సంస్కర్త కూడా. జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 20 రోజులు దీక్ష పూర్తైంది. ఐతే.. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షిణిస్తుండగా.. ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని కోరింది. తాను దీక్షను విరమిస్తే, కేంద్రం.. ధర్మేంద్ర ప్రదాన్‌ను రాజీనామా చెయ్యనివ్వదనీ.. అందువల్ల తాను దీక్షను విరమించే ప్రసక్తే లేదని వాంగ్‌చుక్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు.. ఆస్పత్రికి తరలించేశారు.

CJP ఆన్‌లైన్ సాటిరికల్ ఉద్యమం నుంచి మొదలైన ఈ నిరసనలో NEET, ఇతర పోటీ పరీక్షల పేపర్ లీకేజీలను చూపిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిన ఈ సమస్యలకు బాధ్యత వహించాలనీ, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మద్దతుగా చేరి దీక్ష ప్రారంభించారు. ఆయన ఇప్పటికే 8-9 కేజీల బరువు తగ్గారు, రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం, కండరాల నష్టం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports