విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో తమ మార్కులను మెరుగుపరుచుకునేందుకు వీలుగా ఈ రెండో విడత పరీక్షలను నిర్వహించారు. ఫిబ్రవరిలో తొలి విడత పరీక్షలు జరిపి, ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేసిన అధికారులు.. ఆ తర్వాత మే మూడో వారంలో ఈ రెండో దశ పరీక్షలను పూర్తి చేశారు.
ఈ రెండో విడత పరీక్షల కోసం మొత్తంగా 6,64,027 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 6,63,777 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,13,955 మంది విద్యార్థులు కేవలం మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసమే పరీక్షలు రాయగా, అందులో 3,08,095 మంది (59.95%) విద్యార్థులు తమ పాత స్కోరును విజయవంతంగా మెరుగుపరుచుకున్నారు.
ఇక కంపార్ట్‌మెంట్ కేటగిరీ కింద ఈ పరీక్షలను 1,49,822 మంది విద్యార్థులు రాయగా.. వారిలో 78,503 మంది (52.40%) ఉత్తీర్ణులైనట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మొదటి మరియు రెండో విడత పదో తరగతి పరీక్షలను రెండింటినీ కలిపి చూస్తే.. ఈ ఏడాది మొత్తం సీబీఎస్‌ఈ 10వ తరగతి తుది ఉత్తీర్ణత శాతం 96.78 శాతంగా నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు.
భారీ ట్రాఫిక్ వల్ల వెబ్‌సైట్లు ఓపెన్ కాకపోతే విద్యార్థులు క్రింది అధికారిక పోర్టల్స్ ద్వారా తమ మార్కులను తనిఖీ చేసుకోవచ్చు.
cbse.gov.in
cbseresults.nic.in
results.cbse.nic.in
DigiLocker (డిజీలాకర్ యాప్/వెబ్‌సైట్)
UMANG App (ఉమాంగ్ యాప్)
మార్క్‌షీట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
మొదట సీబీఎస్‌ఈ అధికారిక ఫలితాల వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌పేజీలో కనిపించే “CBSE Class 10 Second Board Result 2026” లింక్‌పై క్లిక్ చేయండి.
మీ రోల్ నంబర్ (Roll Number), స్కూల్ నంబర్, మరియు అడ్మిట్ కార్డ్ ఐడీ (Admit Card ID) వివరాలను నమోదు చేయండి.
సబ్మిట్ బటన్ నొక్కగానే మీ తాత్కాలిక మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
భవిష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.













