Rahul Gandhi: జోరు పెంచిన కాంగ్రెస్.. పార్లమెంట్ దగ్గర టెన్షన్ టెన్షన్ | | ACTPnews

Protest At Parliament


Last Updated:

Delhi: కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్టులను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. దీనికి నిరసనగా రాష్ట్రాల్లో లోక్ భవన్ల దగ్గర ధర్నాలు, ముట్టడులు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. అందువల్ల ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు.. లోక్ భవన్ల ముట్టడికి ప్రయత్నించే ఛాన్స్ ఉంది.

Protest At Parliament
Protest At Parliament

నేడు (జులై 22) దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని లోక్ భవన్లను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. జులై 21న ఢిల్లీలో ప్రధాని ఇంటికి దగ్గర్లో నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు లోక్‌సభ‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తదితర నాయకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఈ అరెస్టులను ఖండిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు.

NEET-UG 2026 పరీక్ష పేపర్ లీక్‌కి బాధ్యతగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చెయ్యాలంటే.. కాక్రోజ్ జనతా పార్టీ.. జులై 20న పార్లమెంట్ దగ్గర ఆందోళన నిర్వహించింది. ఆ సమయంలో.. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా వ్యవహరించారనీ, ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జులై 21న ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ ఇల్లు లోక్ కల్యాణ్ మార్గ్ దగ్గర కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఓ దశలో వారు ప్రధాని ఇంటిని ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి చత్రసాల్ స్టేడియం దగ్గరకు తరలించారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ నిరసనలో పాల్గొని అరెస్టు అయ్యారు. అయితే తర్వాత వారందర్నీ రిలీజ్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచింది.

కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్టులను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. దీనికి నిరసనగా రాష్ట్రాల్లో లోక్ భవన్ల దగ్గర ధర్నాలు, ముట్టడులు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. అందువల్ల ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు.. లోక్ భవన్ల ముట్టడికి ప్రయత్నించే ఛాన్స్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. భారీగా పోలీసుల్ని లోక్ భవన్ల దగ్గర మోహరిస్తున్నాయి. జులై 21న కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి. కర్ణాటకలో బెంగళూరులోని లోక్ భవన్ దగ్గర, పశ్చిమ బెంగాల్‌.. కోల్‌కతాలో, కేరళలోని తిరువనంతపురంలో, గోవాలోని డోనా పాలాలో లోక్ భవన్ దగ్గర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతంపై చక్రవాత తుపాను.. ఏపీ, తెలంగాణకు దంచికొట్టే వర్షాలు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాహుల్, ప్రియాంక అరెస్టులను ఖండించారు. “ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు” అన్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ జాతీయ నాయకులకు సపోర్టుగా వాయిస్ వినిపించారు. “ఈ ఘటనలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ యూనిట్ కూడా హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.

NEET పేపర్ లీక్ విషయం ఇప్పటికే దేశవ్యాప్త చర్చనీయాంశమైంది. విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా వ్యవహరించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఈ సమస్యపై పార్లమెంట్‌లో చర్చ జరగాలనీ, ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ.. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలను రాజకీయ లాభం కోసం చేస్తోందని విమర్శిస్తోంది. అయితే ప్రజాస్వామ్య హక్కులు, విద్యా వ్యవస్థ సమస్యలపై దృష్టి సారించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Psychological Phenomena: మన మెదడు చేసే వింతలు.. డెజా వూ నుంచి అనెమోయా వరకు 7 సైకలాజికల్ రహస్యాలు

ఒకవైపు కాక్రోజ్ జనతా పార్టీ ఆందోళనలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నిరసనలు కలిసి.. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా కాంగ్రెస్ ఆందోళనలతో సభలు వాయిదా పడుతున్నాయి. చర్చలు సాగట్లేదు. ఇవాళ లోక్ భవన్ల ముట్టడి కార్యక్రమాలు విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఈ అంశం పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రతిధ్వనించే అవకాశం ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports