Pooja Hegde: అల్లు అర్జున్ జోడీగా పూజా హెగ్డే.. లోకేశ్ కనగరాజ్ మాస్టర్ ప్లాన్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘AA23’పై సినీ వర్గాల్లో రోజుకో ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

News18
News18

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘AA23’పై సినీ వర్గాల్లో రోజుకో ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్, క్రేజ్‌ను పెంచుకున్న ఐకాన్ స్టార్, తదుపరి చిత్రాలను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ‘AA23’ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రచారం నిజమైతే, ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం అవుతుంది. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ (DJ), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాలలో అల్లు అర్జున్ – పూజా హెగ్డే జోడీగా అలరించారు. 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించి నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో వీరిద్దరి మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన ‘బుట్టబొమ్మ’ పాట సృష్టించిన సంచలనం భారతీయ సినీ రంగాన్నే ఊపేసింది.

ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌తో పాటు మరికొన్ని భారీ చిత్రాల లైనప్‌తో బిజీగా ఉన్నారు. ఆ తదుపరి ప్రాజెక్ట్‌గానే లోకేశ్ కనగరాజ్ సినిమా పట్టాలెక్కనుంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి కల్ట్ యాక్షన్ థ్రిల్లర్లతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న లోకేశ్ కనగరాజ్, తన సినిమాల్లో హీరోలతో పాటు కథానాయికల పాత్రలను కూడా ఎంతో బలంగా తీర్చిదిద్దుతారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే ‘మోనికా’ పాటలో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ పరిచయం కూడా ‘AA23’లో ఆమె ఎంపికకు దోహదపడిందనే వార్తలకు బలాన్నిస్తోంది.

తనదైన శైలి ఐకానిక్ యాక్షన్ డ్రామాలకు పేరుగాంచిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ మోస్ట్ సక్సెస్‌ఫుల్ పెయిర్ మళ్లీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అయితే, ఈ వార్తలపై నిర్మాణ సంస్థ నుంచి కానీ, నటీనటుల నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports