Last Updated:
రఘువంశీ, రింకూ సింగ్‌ల మెరుపు ఇన్నింగ్స్‌తో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై కేకేఆర్ భారీ స్కోర్ సాధించింది. రఘువంశీ, రింకూ సింగ్‌ల మెరుపు ఇన్నింగ్స్‌తో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన KKRకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అంజిక్య రహానే (19), ఫిన్ ఆలెన్ (18) వేగంగా పరుగులు చేసినా.. తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన రఘువంశీ 71 (7 ఫోర్లు, 3 సిక్సులు) జట్టును ఆదుకున్నాడు. కెమెరాన్ గ్రీన్‌తో (32) కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక గ్రీన్ ఔటైన తర్వాత వచ్చిన రింకూ సింగ్ 49* (3 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో కేకేఆర్ భారీ స్కోర్ సాధించగలిగింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో భువీ, హేజల్‌వుడ్, రసిక్ సలామ్ చెరో వికెట్ తీసుకున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
May 13, 2026 10:28 PM IST













