Last Updated:
హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని, స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ టైం’. సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా..
హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని, స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ టైం’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ఇండియన్ సినీ పరిశ్రమలోనే ప్రతిష్టాత్మక వీఎఫ్‌ఎక్స్ మూవీలలో ఒకటిగా నిలిచే ప్రయత్నం చేసింది. ఈ సినిమాతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం కాగా, అఖిల్ సార్థక్ కీలక పాత్రలో కనిపించారు. హీరోయిన్‌గా అనిక్క విక్రమన్ నటించగా, మైమ్ గోపి, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
2304 AD నేపథ్యంలో ప్రారంభమయ్యే ఈ సినిమా, భూమిపై మానవజాతి అంతానికి దారితీసిన పరిణామాలు, కొత్త ప్రపంచ నిర్మాణం, కొత్త భారత ఆవిర్భావం వంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో సాగుతుంది. ఏలియన్స్ భూమిపై జరిగిన సంఘటనలను తెలుసుకునే క్రమంలో, ఒక పవిత్రమైన మహిళ కొత్త సృష్టికి ఎలా నాంది పలికిందనే అంశాన్ని కథ ప్రధానంగా చూపిస్తుంది. హీరోయిన్ అనిక్క విక్రమన్‌ను పెళ్లి చేసుకోవాలని భూపాల్ రాజు, శివకుమార్ రామచంద్రవరపు, అఖిల్ సార్థక్ పాత్రలు ప్రయత్నిస్తుంటాయి. ఆ ప్రమాదకర పరిస్థితుల నుంచి ఆమె ఎలా బయటపడింది? సౌరబ్ ధింగ్ర పాత్రతో ఆమెకు ఎలా పరిచయం ఏర్పడింది? చివరకు కొత్త ప్రపంచ నిర్మాణానికి దారితీసిన అసలు సంఘటన ఏమిటి? అన్నది సినిమాలో కీలక అంశం.
విశ్లేషణ: దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, థ్రిల్లర్ అంశాలను మిక్స్ చేస్తూ కొత్త తరహా కథను చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కొన్ని విజువల్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను గుర్తు చేసేలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగిన భావన కలిగినా, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు, ఉత్కంఠభరిత సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. క్లైమాక్స్‌లో చూపించిన విజువల్ ప్రెజెంటేషన్ ఆకట్టుకుంటుంది.
సౌరబ్ ధింగ్ర తొలి సినిమానే అయినప్పటికీ మంచి నటన కనబరిచారు. అనిక్క విక్రమన్ గ్లామర్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకుంది. అఖిల్ సార్థక్ తన పాత్రలో ఎనర్జిటిక్‌గా కనిపించారు. భూపాల్ రాజు, మైమ్ గోపి, అజయ్ రత్నం, గాయత్రి గుప్త పాత్రలు కూడా సినిమాకు బలం చేకూర్చాయి.
ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ టెక్నికల్ స్టాండర్డ్స్. ఎలాంటి AI టెక్నాలజీ ఉపయోగించకుండా పూర్తిగా హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో విజువల్ ఎఫెక్ట్స్ రూపొందించడం విశేషం. సినిమాటోగ్రాఫర్స్ వేణు మురళీధర్, రామ్ అందించిన విజువల్స్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు బాగా సపోర్ట్ చేశాయి.
గ్రాండ్ వీఎఫ్‌ఎక్స్ విజువల్స్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
సెకండాఫ్ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్
ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం
కథనం కొంత క్లిష్టంగా అనిపించే అవకాశం
‘ఫస్ట్ టైం’ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన న్యూ ఏజ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్. టెక్నికల్‌గా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఎంపికగా నిలుస్తుంది.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
May 22, 2026 11:36 AM IST













