Last Updated:
హీరోల అభిమాన సంఘాలు అంటే తమ అభిమాన నటుడి సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద సందడి చేయడం, పుట్టిన రోజులు చేయడం చూస్తుంటాం. కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందుకు బిన్నం అనిపించుకుంటున్నారు.
సాధారణంగా సినిమా హీరోల అభిమాన సంఘాలు అంటే తమ అభిమాన నటుడి సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద సందడి చేయడం, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం, సినిమాను ప్రమోట్ చేసుకోవడం వరకే పరిమితం అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, అభిమానం అంటే కేవలం సినిమాకే పరిమితం కాదని, సామాజిక బాధ్యతతో సమాజానికి మేలు చేయడంలోనూ ముందుండొచ్చని ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్’ (AAFA- ఆఫా) నిరూపిస్తోంది. దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సామాన్యుల నుండి వైద్య వర్గాల వరకు అందరి మన్ననలు పొందుతోంది.














