Virosh: ప్రపంచ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘విరోష్’ జంట.. ఇదెక్కడి క్రేజ్‌రా మామ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటల ప్రేమకథలు అభిమానులకు చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. అలాంటి ఒక అందమైన లవ్‌స్టోరీనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలది. వీరి రిలేషన్‌పై ఏళ్లుగా ఎన్నో రూమర్స్ వచ్చాయి. వెకేషన్స్‌లో మీడియా కంటపడినా అఫీషియల్‌గా మాత్రం ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు.

News18
News18

సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటల ప్రేమకథలు అభిమానులకు చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. అలాంటి ఒక అందమైన లవ్‌స్టోరీనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలది. వీరి రిలేషన్‌పై ఏళ్లుగా ఎన్నో రూమర్స్ వచ్చాయి. వెకేషన్స్‌లో మీడియా కంటపడినా అఫీషియల్‌గా మాత్రం ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. ఆ సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగా వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక తర్వాత విజయ్ తన సొంతూరిలో సత్యనారాయణ వత్రం, ఆ తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరుపుకున్నారు. కాగా.. తాజాగా రష్మిక సొంత ఊరైన కొడగులో మరోసారి వీరిద్దరు రిసెప్షన్ జరుపుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు.

వీరిద్దరు వెండితెరపై ఎంతటి మ్యాజిక్ చేస్తారో మనందరికీ తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించాయి. ఆ సినిమాల తర్వాత వీరిద్దరూ ఎప్పుడు కలిసినా సోషల్ మీడియాలో ఒక రేంజ్ హంగామా జరుగుతుంది. ఇప్పుడు వీళ్లు ఇద్దరు చేసిన ఒక వాణిజ్య ప్రకటన (Ad) ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలో కూడా ఈ జంట ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది.

వీరిద్దరూ కలిసి నటించిన ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) యాడ్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాడ్‌లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీనికి నిదర్శనంగా ఈ పోస్టుకు ఇప్పటికే 9.1 మిలియన్లకు పైగా లైక్స్ రావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ పొందిన ప్రకటనల్లో ఇది రెండో స్థానంలో నిలిచిందని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి మొదటి స్థానంలో కూడా ఈ జంట ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో వీరిద్దరు కలిసి ‘మాన్యవార్’ సంస్థ కోసం ఒక వెడ్డింగ్ యాడ్ చేశారు. ఆ యాడ్ పోస్టుకు ఏకంగా 11.5 మిలియన్ల లైక్స్ వచ్చాయి. సుమారు 100 మిలియన్ల వ్యూస్ కూడా లభించాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా టాప్-2 అత్యధిక లైక్డ్ యాడ్ పోస్టులు కేవలం విజయ్, రష్మిక ఖాతాలో ఉండటం గొప్ప విషయం.

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కలిసి చేసిన లూయిస్ విట్టన్ (Louis Vuitton) వంటి అంతర్జాతీయ బ్రాండ్ యాడ్స్‌ను కూడా వెనక్కి నెట్టి మన టాలీవుడ్ స్టార్స్ ముందుకు వెళ్లడం విశేషం. వీళ్ళను అభిమానులు ముద్దుగా ‘విరోష్’ అని పిలుచుకుంటారు. ఈ జంట ఎప్పుడు కనిపించినా సోషల్ మీడియాలో లైక్స్ వర్షం కురవడం సహజం. బ్రాండ్ వ్యాల్యూ పరంగా కూడా వీరు ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *