బగీరాతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్.. తన జీవితంలో ఆ పెంపుడు కుక్కకు ఉన్న ప్రత్యేకతను వివరించారు. ‘బఘీరా, నువ్వు నా జీవితంలోకి ఒక తోడుగా వచ్చావు.. కానీ ఎప్పుడు నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావో తెలియదు. ప్రేమ, నమ్మకం, అల్లరి, నువ్వు మాత్రమే ఇవ్వగలిగిన ఓ ప్రత్యేకమైన ఆత్మీయతతో నా ప్రతి రోజును నింపావు. నువ్వు లేని లోటు భరించలేనంత పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చింది. కానీ నువ్వు నా హృదయంలో వదిలి వెళ్లిన ప్రేమ కూడా అంతే గొప్పది. నన్నే నీ మనిషిగా ఎంచుకున్నందుకు, నా వెంట నడిచినందుకు, ఈ నాలుగేళ్ల జీవితాన్ని ఎన్నో రెట్లు అందంగా మార్చినందుకు నీకు కృతజ్ఞతలు. స్వేచ్ఛగా పరుగెత్తు నా చిన్నారి.. నిన్ను ఎంతో ప్రేమించాం.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.













