Last Updated:
క్రాఫ్టన్ ఇండియా BGMI లైట్ ప్రీ-రిజిస్ట్రేషన్ ఆగస్టు 25 నుండి ప్రారంభం. తక్కువ సామర్థ్యం గల ఫోన్‌ల కోసం 1GB డౌన్‌లోడ్ సైజుతో వస్తుంది.
భారత్‌లో బాటిల్ రాయల్ గేమింగ్‌ను ఇష్టపడే మొబైల్ గేమర్లకు క్రాఫ్టన్ ఇండియా కీలక ప్రకటన చేసింది. తక్కువ సామర్థ్యం ఉన్న స్మార్ట్‌ఫోన్లలోనూ సులభంగా ఆడుకునేలా రూపొందిస్తున్న BGMI Lite కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, 2026 ఆగస్టు 25 నుంచి ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే ద్వారా BGMI Lite కోసం ప్రీ-రిజిస్టర్ చేసుకోవచ్చు. పూర్తి గేమ్‌ను ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో విడుదల చేయాలని క్రాఫ్టన్ లక్ష్యంగా పెట్టుకుంది.














