Last Updated:
Viral News: సందు దొరికితే చాలు అభిమానులు రెచ్చిపోతూ ఉంటారు. తమ అభిమాన నటుడిపై ఉండే ప్రేమ, గౌరవంతో ఎదుటి వాళ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడటం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఏదోలా తాము హైలెట్ కావాలనే కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఉన్నతమైన స్థానంలో ఉండే వ్యక్తులు, మాజీ సీఎం, పీఎంలపై చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు.
Viral News: సందు దొరికితే చాలు అభిమానులు రెచ్చిపోతూ ఉంటారు. తమ అభిమాన నటుడిపై ఉండే ప్రేమ, గౌరవంతో ఎదుటి వాళ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడటం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఏదోలా తాము హైలెట్ కావాలనే కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఉన్నతమైన స్థానంలో ఉండే వ్యక్తులు, మాజీ సీఎం, పీఎంలపై చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. రీసెంట్గా జూనియర్ పవన్ కల్యాణ్ అనే యువకుడు.. చిరంజీవి బర్త్ డే వేడుకల వేదికపై నోరు పారేసుకున్నాడు. మెగా ఫ్యామిలీ జోలికి వస్తే గుడ్డలు ఊడదీసి కొడతానంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కి వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ కావడంతో వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానుల నుండి పవన్ కల్యాణ్ ఫ్యాన్‌కి గట్టి స్ట్రోక్ తగిలినట్లుగా తెలుస్తోంది. చేసింది పొరపాటు అని గ్రహించినప్పటికి తాను కూడా మరో పవన్ కల్యాణ్ అన్నట్లుగా ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ మరో వీడియో రిలీజ్ చేశాడు. అయితే అందులో వైసీపీ నేతలు, జగన్ అభిమానులకు క్షమాపణ చెప్పినట్లే చెప్పి ఆపార్టీ నేతలపై విమర్శలు చేయడం ఇప్పుడు నెట్టింట్లో రచ్చ రచ్చ అవుతోంది. అసలు ఎవడ్రా నువ్వూ అంటూ వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు జూనియర్ పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నారు.














