Last Updated:
Night Club: ఇంగ్లండ్ క్రికెటర్ల వివాదాస్పద వ్యవహార శైలి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైదానంలో ఆట కంటే మైదానం బయట వివాదాలతో వార్తల్లో నిలవడం ఆ జట్టు ఆటగాళ్లకు పరిపాటిగా మారింది.
తాజాగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ డెర్బీలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవలో చిక్కుకుని పెద్ద వివాదంలో పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆయనకు చేతులకు బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. అయితే ఆ తర్వాత ఎటువంటి చట్టపరమైన అభియోగాలు నమోదు చేయకుండానే కార్స్‌ను విడుదల చేశారు.














