Aashirwad Sooryavanshi: వామ్మో వీడు అన్న కంటే డేంజర్‌లా ఉన్నాడే.. 10 ఏళ్ల వయసులోనే సెంచరీ బాదిన వైభవ్ తమ్ముడు! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వైభవ్ చిన్న తమ్ముడు 10 ఏళ్ల ఆశీర్వాద్ సూర్యవంశీ స్థానిక క్రికెట్ టోర్నమెంట్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు.

News18
News18

Aashirwad Sooryavanshi: ఐపీఎల్ 2026లో తన సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు అదే కుటుంబం నుండి మరో ప్లేయర్ వెలుగులోకి వచ్చాడు. వైభవ్ చిన్న తమ్ముడు 10 ఏళ్ల ఆశీర్వాద్ సూర్యవంశీ స్థానిక క్రికెట్ టోర్నమెంట్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో జరిగిన ఒక స్థానిక మ్యాచ్‌లో ‘క్రికెట్ అకాడమీ తాజ్‌పూర్’ తరఫున ఆడిన ఆశీర్వాద్ కేవలం 87 బంతుల్లోనే 103 పరుగులు చేసి అదరగొట్టాడు. అన్నలాగే ఈ చిన్నారి సూర్యవంశీకి కూడా బౌండరీలంటే ఎంత ఇష్టమో తన ఇన్నింగ్స్ ద్వారా నిరూపించాడు. ఈ మెరుపు సెంచరీలో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. తన తమ్ముడు సాధించిన ఈ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌షాట్‌ను వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో గర్వంగా పంచుకున్నాడు.

ఆకాశమే హద్దుగా..

చిన్న తమ్ముడు ఆశీర్వాద్ ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో తొలి అడుగులు వేస్తుండగా.. అన్న వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల మాత్రం అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ దాదాపు 800 (776) పరుగులు చేసి, అత్యంత పిన్న వయసులోనే ‘ఆరెంజ్ క్యాప్’ గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో వైభవ్ తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీని కూడా నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక భారతీయుడు సాధించిన రెండు అత్యంత వేగవంతమైన శతకాలు (Fastest Hundreds) వైభవ్ పేరిటే ఉండటం విశేషం.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed