Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచ రికార్డు బద్దలు! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, భారత టీ20 చరిత్రలో అత్యంత వేగంగా శతకం బాదిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

News18
News18

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చారిత్రక ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోస్తూ, కేవలం 30 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2017లో శ్రీలంకపై ఇండోర్ వేదికగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 35 బంతుల్లో సాధించిన సెంచరీ రికార్డును అభిషేక్ తాజాగా బద్దలు కొట్టాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో అతడు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఫజల్హక్ ఫరూఖీ బౌలింగ్‌లో బౌండరీతో ఖాతా తెరిచిన అతడు, ఆ తర్వాత ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భవిష్యత్ టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు.

క్రీజులోకి వచ్చిన కాసేపు ఆచితూచి ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లయ అందుకున్నాక గేర్ మార్చాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన రెండో ఓవర్లోనే రెండు భారీ సిక్సర్లు బాది తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. ఫరూఖీ వేసిన షార్ట్ పిచ్ బంతులను సైతం సునాయాసంగా బౌండరీలకు తరలించాడు.

మహ్మద్ నబీ వేసిన ఐదో ఓవర్‌లో అభిషేక్ విశ్వరూపం చూపించాడు. ఆ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్‌లోనూ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను సైతం వదలకుండా భారీ షాట్లు ఆడాడు.

బౌలర్ ఎవరైనా సరే అటాకింగ్ గేమ్ ఆడుతూ 30 బంతుల్లోనే వంద పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. చివరకు 108 పరుగుల స్కోరు వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రివ్యూ తీసుకున్నప్పటికీ ఎడ్జ్ అయినట్లు తేలడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

Fastest centuries by Indian cricketers in men’s T20Is:

Player Balls Match Venue Date
Abhishek Sharma 30 India vs Afghanistan New Delhi 17/09/2026
Rohit Sharma 35 India v Sri Lanka Indore 22/12/2017
Abhishek Sharma 37 India v England Wankhede 02/02/2025
Sanju Samson 40 India v Bangladesh Hyderabad 12/10/2024
Tilak Varma 41 India v South Africa Johannesburg 15/11/2024
Ishan Kishan 42 India v New Zealand Thiruvananthapuram 31/01/2026
Suryakumar Yadav 45 India v Sri Lanka Rajkot 07/01/2023
KL Rahul 46 India v West Indies Lauderhill 27/08/2016
Abhishek Sharma 46 India v Zimbabwe Harare 07/07/2024
Sanju Samson 47 India v South Africa Durban 08/11/2024
Suryakumar Yadav 48 India v England Nottingham 10/07/2022



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports