Narendra Modi At 76: పాలనాధిపతిగా 25 ఏళ్ల అరుదైన ప్రస్థానం.. నరేంద్ర మోదీ లైఫ్‌లో 10 కీలక ఘట్టాలు ఇవే | | ACTPnews

Narendra Modi At 76: పాలనాధిపతిగా 25 ఏళ్ల అరుదైన ప్రస్థానం.. నరేంద్ర మోదీ లైఫ్‌లో 10 కీలక ఘట్టాలు ఇవే |


గ్రేట్ లీడర్..

ఓ సాధారణ స్థాయి కార్యకర్త నుంచి గుజరాత్ సీఎం, దేశ ప్రధానిగా మోదీది రాష్ట్ర, దేశ, ప్రపంచం రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర వేసుకున్నారు.

ఈ పాతికేళ్ల కాలంలో మోదీ ప్రస్థానాన్ని ప్రతిబింబించే 10 కీలక ఘట్టాలు:

1. 2001: గుజరాత్ సీఎంగా అనూహ్య బాధ్యతలు : అప్పటివరకు పార్టీ సంస్థాగత బాధ్యతల్లో ఉన్న మోదీ, 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జనవరి 2001లో సంభవించిన భయంకరమైన భూకంపం తర్వాత గుజరాత్‌ను పునర్నిర్మించే భారీ బాధ్యత ఆయనపై పడింది.

2. 2002: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలుగోద్రా రైలు దహనం, అనంతర ఘర్షణల నీడలో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 182 స్థానాలకు గాను 127 స్థానాలు గెలుచుకుంది. ఈ విజయం మోదీని ప్రజామోదం పొందిన నాయకుడిగా నిలబెట్టింది.

3. 2007: ‘గుజరాత్ మోడల్’ ఆవిర్భావంరెండోసారి 117 సీట్లతో విజయం సాధించాక, గుజరాత్‌లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామిక వేగం పెరిగాయి. ఇదే తదనంతర కాలంలో ‘గుజరాత్ మోడల్’ అభివృద్ధిగా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది.

4. 2012: జాతీయ రాజకీయాలకు నాందివరుసగా మూడోసారి 115 స్థానాలతో విజయం సాధించడంతో, మోదీ ప్రభంజనం రాష్ట్ర సరిహద్దులు దాటింది. బీజేపీలో అత్యంత ప్రముఖ నాయకుడిగా ఎదిగి, ప్రధాని అభ్యర్థిత్వానికి బలమైన పోటీదారుగా మారారు.

5. 2013: ప్రధాని అభ్యర్థిగా ప్రకటనసెప్టెంబర్ 2013లో బీజేపీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. సాంకేతికత, ప్రత్యక్ష ప్రజా సంబంధాలు, వికాస్ (అభివృద్ధి) ఎజెండాతో చేపట్టిన ప్రచారం జాతీయ రాజకీయాలను మలుపు తిప్పింది.

6. 2014: ఢిల్లీ పీఠం కైవసం2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు సాధించి పూర్తి మెజారిటీ పొందింది. మే 26న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, తనను తాను “ప్రధాన్ సేవక్”గా వర్ణించుకున్నారు. స్వచ్ఛ భారత్, జన్ ధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాలకు శ్రీకారం చుట్టారు.

7. 2019: భారీ మెజారిటీతో రెండోసారి2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 303 స్థానాలు గెలుచుకుంది. జాతీయ భద్రత, సంక్షేమ పథకాల అమలు ప్రాతిపదికన మోదీ నాయకత్వానికి ప్రజలు మరోసారి అఖండ విజయాన్ని అందించారు.

8. 2019: ఆర్టికల్ 370 రద్దురెండో విడత అధికారంలోకి వచ్చాక, ఆగస్టు 2019లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పార్లమెంట్ రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారు.

9. 2020-21: కోవిడ్ సవాళ్లు – వాక్సినేషన్కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత టీకా పంపిణీ కార్యక్రమం, డిజిటల్ నెట్‌వర్క్ ద్వారా సంక్షేమ ఫలాల అందించడం మోదీ ప్రభుత్వ పరిపాలనా దక్షతకు పరీక్షగా నిలిచాయి.

10. 2024: హ్యాట్రిక్ విజయం2024 లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంతో మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో భారతీయ నేతగా చరిత్రకెక్కారు. సాధారణ ప్రచారక్ నుంచి ప్రారంభమైన నరేంద్ర మోదీ రాజకీయం, గత 25 ఏళ్లుగా నిరంతర అధికార పీఠంపై కొనసాగుతూ సమకాలీన భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన శక్తుల్లో ఒకటిగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed