Last Updated:
అల్లు అర్జున్ కొత్త సినిమా రాకా. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka). ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ‘కల్కి 2898 AD’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న దీపికా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సెన్సేషనల్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు అల్లు అర్జున్ స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘రాకా’ కోసం అల్లు అర్జున్ సాధారణ ఫిక్స్డ్ రెమ్యునరేషన్‌కు బదులుగా ప్రాఫిట్ షేరింగ్ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అంటే సినిమా ద్వారా వచ్చే లాభాల్లో కొంత వాటాను పారితోషికంగా తీసుకునేలా ఒప్పందం కుదిరిందనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి, మంచి లాభాలను అందుకుంటే బన్నీకి ఏకంగా రూ.300 కోట్ల వరకు పారితోషికం దక్కే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ మొత్తానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు ‘రాకా’ నిర్మాణానికి సుమారు రూ.600 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందనే ప్రచారం ఉంది. ఇందులో దాదాపు 50 శాతం మొత్తం ఇప్పటికే షూటింగ్ దశలోనే ఖర్చయిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కావడంతో మేకర్స్‌పై ఆర్థిక భారం తగ్గించేందుకు బన్నీ ప్రాఫిట్ షేరింగ్ విధానాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.
గత కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ తాజాగా ఒక క్రైప్టిక్ పోస్టర్‌ను వదిలారు. డార్క్ బ్యాక్‌డ్రాప్‌లో కేవలం ‘37’ అనే నంబర్‌ను మాత్రమే హైలైట్ చేస్తూ విడుదల చేసిన ఈ లుక్, అభిమానుల్లో క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది.
‘పుష్ప’ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ‘జవాన్’ లాంటి వెయ్యి కోట్ల ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టును కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తోంది.














