Last Updated: Sep 27, 2026, 21:19 IST
వెంకీమామ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్ గట్రా పాజిటీవ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి నారాయణమ్మ అనే మాస్ బీట్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు వెంకీమామ, త్రివిక్రమ్, నివేధా పేతురాజ్, శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతి, థమన్లు హాజరయ్యారు. రామ జోగయ్య శాస్త్రీ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రభ, రామ్ మిర్యాల ఆలపించారు. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కాబోతుంది.













