Ajit Agarkar: వామ్మో అగార్కర్ ఇన్ని చేశాడా? చాక్లెట్ బాయ్‌లా కనిపించే విలన్! | క్రీడా వార్తలు | ACTPnews

అజిత్ అగార్కర్


Last Updated:

Ajit Agarkar: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ త్వరలోనే పదవి నుంచి తప్పుకోనున్నారనే వార్తల నేపథ్యంలో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) అంతర్గత వ్యవహారాలు, నిర్ణయాల ప్రక్రియలోని సంక్లిష్టతలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

అజిత్ అగార్కర్
అజిత్ అగార్కర్

కీలక సమయాల్లో బీసీసీఐలోని కొందరు ప్రముఖుల జోక్యం, అగార్కర్ నిర్ణయాలకు భిన్నమైన వైఖరి జట్టు ఎంపికపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అగార్కర్‌కు, బీసీసీఐ పెద్దలకు మధ్య విభేదాలు నిన్న మొన్నటివి కావని, వీటిలో చిక్కుకున్న మొదటి ఆటగాడు రోహిత్ శర్మ మాత్రమే కాదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. 2023లో అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో సమావేశంలోనే ఈ విభేదాలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఆసియా కప్ సన్నాహకాల నేపథ్యంలో, ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ద్వితీయ శ్రేణి భారత జట్టును ఎంపిక చేయాల్సి వచ్చింది.

ఆ నివేదిక ప్రకారం.. ఐర్లాండ్ సిరీస్‌కు యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించాలని అగార్కర్ భావించారు. అప్పట్లో ఆసియా కప్ తర్వాత జరగనున్న 2023 ఆసియా క్రీడలకు కూడా గైక్వాడ్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో, ఐర్లాండ్ పర్యటన అతనికి నాయకత్వ అనుభవాన్ని ఇస్తుందని అగార్కర్ యోచించారు.

అయితే, బీసీసీఐ మాత్రం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైపు మొగ్గు చూపింది. గాయం కారణంగా నెలల తరబడి జట్టుకు దూరమైన బుమ్రాకు అదే పునరాగమన సిరీస్. బుమ్రాపై పనిభారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే గైక్వాడ్‌కు పగ్గాలు ఇవ్వాలని అగార్కర్ భావించినప్పటికీ, బీసీసీఐ జోక్యం చేసుకుని బుమ్రాకే నాయకత్వ బాధ్యతలు అప్పగించేలా చేసింది. కెప్టెన్సీ చేపట్టేందుకు బుమ్రా చూపిన ఆసక్తే బోర్డు నిర్ణయానికి కారణంగా నిలిచింది. ఆ సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.

అగార్కర్ వైఖరి – సెలక్షన్ తీరు

చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ సరైన గుర్తింపు పొందకపోయినప్పటికీ, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం, తన అంచనాలపై గట్టి నమ్మకం ఉన్న అధికారిగా పలు వర్గాలు పేర్కొంటున్నాయి. బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లను ఆయన వీలైనంత వరకు తిప్పికొట్టారని, అయితే పరిస్థితికి తగ్గట్టుగా పూర్తిగా మొండిపట్టు పట్టకుండా సర్దుకుపోయారని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

రోహిత్ శర్మ ఉదంతంలో బోర్డు బాహాటంగా స్టార్ ప్లేయర్‌కు మద్దతు తెలపడంపై అగార్కర్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. బోర్డు వైఖరి కారణంగా సీనియర్ ఆటగాడిని పక్కన పెట్టాలనే నిర్ణయాన్ని అమలు చేయడం ఆయనకు అసాధ్యంగా మారింది. భవిష్యత్తులో అగార్కర్ స్థానంలో పార్థివ్ పటేల్ వచ్చినా లేదా మరొకరు వచ్చినా.. కేవలం కఠినమైన సెలక్షన్ నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, బోర్డు అంతర్గత రాజకీయాలు, ఒత్తిళ్లను సమన్వయం చేసుకోవడం కొత్త చీఫ్ సెలెక్టర్‌కు పెను సవాలుగా మారనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports