Akhil Akkineni: నవ్వు ఆపుకోలేరు.. “నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున”.. ప్రాంక్ కాల్‌లో హీరోని ఆటపట్టించిన అపరిచిత వ్యక్తి.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Akhil Akkineni: నవ్వు ఆపుకోలేరు.. "నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున".. ప్రాంక్ కాల్‌లో హీరోని ఆటపట్టించిన అపరిచిత వ్యక్తి.. | తెలుగు సినిమా వార్తలు


‘లెనిన్’ ప్రమోషన్‌లో భాగంగా గెటప్ శ్రీను ముందుగా అఖిల్‌తో సరదాగా ఇంటర్వ్యూ నిర్వహించాడు. అనంతరం ఓ ర్యాండమ్ మొబైల్ నంబర్‌కు కాల్ చేసి, ఆ వ్యక్తితో అఖిల్ మాట్లాడేలా చేశాడు. ఫోన్ ఎత్తిన వ్యక్తికి అఖిల్ తనను తాను పరిచయం చేసుకుంటూ, “సార్.. నేను అఖిల్ అక్కినేని మాట్లాడుతున్నాను” అని చెప్పాడు.

అయితే అవతలి వ్యక్తి మాత్రం ఏమాత్రం నమ్మకుండా, “అలా అయితే నేను నాగార్జున మాట్లాడుతున్నా.. చెప్పు” అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అఖిల్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తాను నిజంగానే అఖిల్‌నని పలుమార్లు చెప్పినా, కాలర్ మాత్రం అస్సలు నమ్మలేదు.

అంతేకాదు, “నాగచైతన్య ఎలా ఉన్నాడు? మీరు అసలు ఎవరు? నాకు ఎందుకు ఫోన్ చేశారు?” అంటూ వరుస ప్రశ్నలు సంధించాడు. అఖిల్ ఎంత వివరించినా, “నీ వాయిస్‌తోనే గుర్తుపట్టేశా.. నన్ను ఆటపట్టించకు” అంటూ సరదాగా మాట్లాడాడు.

చివరకు అఖిల్, “మీరు నమ్మట్లేదు కాబట్టి మీ లొకేషన్ పంపండి.. నేను వచ్చి కలుస్తాను” అని చెప్పగా, “నా లొకేషన్ మీకెందుకు? మీకు కావాల్సిన వ్యక్తి నేనా?” అంటూ కాలర్ మరోసారి ఫన్నీగా స్పందించాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వులు ఆపుకోలేకపోయారు.

ఆ తర్వాత గెటప్ శ్రీను ఫోన్ తీసుకుని, “నేను గెటప్ శ్రీను మాట్లాడుతున్నా” అని చెప్పినా, కాలర్ వెంటనే “హా… నేను సుధీర్ మాట్లాడుతున్నా చెప్పు” అంటూ మరోసారి ట్విస్ట్ ఇచ్చాడు. అఖిల్, శ్రీను ఇద్దరూ కలిసి సినిమా ప్రమోషన్‌లో భాగంగానే కాల్ చేశామని చెప్పినా అతడు నమ్మలేదు.

“అఖిల్ అక్కినేని నాకు ఎందుకు ఫోన్ చేస్తాడు? నా నంబర్ ఆయన దగ్గరకు ఎలా వచ్చింది? ఇది నేను ఎలా నమ్మాలి?” అంటూ కాలర్ తన సందేహాలను వ్యక్తం చేశాడు. అయితే ఇది ర్యాండమ్‌గా చేసిన కాల్ అని వివరించడంతో చివరకు కొంతవరకు నమ్మిన అతను, “నేను అఖిల్‌కు పెద్ద ఫ్యాన్. శ్రీనన్నా.. జబర్దస్త్‌లో ఒక అవకాశం ఇవ్వు. ప్లీజ్ అన్నా” అంటూ సరదాగా అభ్యర్థించాడు.

దాంతో గెటప్ శ్రీను నవ్వుతూ, “ఇప్పటికే చాలైంది తమ్ముడు.. తర్వాత మాట్లాడుదాం” అంటూ కాల్ ముగించాడు. ఈ మొత్తం సంభాషణ అక్కడున్న వారిని కడుపుబ్బా నవ్వించగా, వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాల్ అనంతరం అఖిల్, గెటప్ శ్రీను కలిసి సమోసాలు తింటూ మరికొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగార్జున సినిమాల్లో ఏ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటావని శ్రీను అడగగా, అఖిల్ ‘హలో బ్రదర్’ పేరు చెప్పాడు. అయితే అలాంటి క్లాసిక్ చిత్రాలను మళ్లీ తీయడం చాలా బాధ్యతతో కూడుకున్న విషయమని అభిప్రాయపడ్డాడు.

అలాగే భవిష్యత్తులో ‘అన్నమయ్య’ తరహా ఆధ్యాత్మిక చిత్రం చేసే ఆలోచన ఉందా అని అడిగితే, అలాంటి సినిమా చేయాలంటే సరైన సమయం, సరైన కథతో పాటు రాఘవేంద్రరావు, నాగార్జున, కీరవాణి వంటి అద్భుతమైన కాంబినేషన్ మళ్లీ కుదిరితేనే సాధ్యమవుతుందని అఖిల్ పేర్కొన్నాడు.

ఇలా ‘లెనిన్’ ప్రమోషన్‌లో భాగంగా చేసిన ఈ ప్రాంక్ కాల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా “నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున” అంటూ కాలర్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ డైలాగ్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed