వీళ్లు నాగార్జున కన్నా కిందే.. మనీకంట్రోల్ (Moneycontrol) వెబ్సైట్ ప్రకారం.. నాగార్జన నికర సంపద 410 మిలియన్ డాలర్లు. అంటే, రూ.3,572 కోట్లు. బాలీవుడ్లో టాప్ స్టార్లుగా చెలామణి అవుతున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan- రూ.3,200 కోట్లు), హృతిక్ రోషన్ (Hritik Roshan- రూ.3,100 కోట్లు), సల్మాన్ ఖాన్ (Salman Khan- రూ.2,900 కోట్లు), అక్షయ్ కుమార్ (Akshay Kumar- రూ.2,700 కోట్లు), ఆమిర్ ఖాన్ (Aamir Khan- రూ.1,900 కోట్లు)ను సైతం అధిగమించి టాప్లో నిలిచాడు. దక్షిణాదిలో చిరంజీవి (Chiranjeevi- రూ.1,650 కోట్లు), రామ్చరణ్ (Ram Charan-రూ.1370), రజనీకాంత్ (Rajinikanth- రూ.500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR- రూ.500 కోట్లు), బాలకృష్ణ (480 కోట్లు)సైతం నాగార్జున వెనకే ఉన్నారు.













