ట్రాక్ మార్చి.. మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన నరేష్: చాలా సంవత్సరాల పాటు సరైన హిట్ లేక సతమతమైన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ‘నాంది’ సినిమాతో తనలోని అసలైన నటుడిని బయటకు తీశారు. కామెడీ పక్కనపెట్టి సీరియస్ రోల్ చేసిన నరేష్‌కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. అక్కడి నుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఆ తర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’ వంటి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకున్న ఆయన, రీసెంట్‌గా ఆ ఒక్కటీ అడక్కు, 12ఎ రైల్వే కాలనీ, రంభ ఊర్వశి మేనక వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.














