Last Updated:
కాస్త బాధలో టెన్షన్లో ఉన్నా, లో అనిపించినా సరే అల్లరి నరేష్ సినిమాలు చూస్తే రిలీఫ్ దొరుకుతుంది. అంతలా జనాల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అల్లరి నరేష్.
రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ రేంజ్ కామెడీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. అసలు అల్లరోడు సినిమా వస్తుందంటే మినిమం ఎంటర్టైనమెంట్ పక్కా అని అందరూ ఫిక్సయిపోతారు. అసలు మనం ఇప్పుడు చూస్తున్న అల్లరి నరేష్ వేరు.. ఒకప్పుడు అల్లరి నరేష్ వేరే, ఆయన సినిమాలే వేరు. కాస్త బాధలో టెన్షన్లో ఉన్నా, లో అనిపించినా సరే అల్లరి నరేష్ సినిమాలు చూస్తే రిలీఫ్ దొరుకుతుంది. అంతలా జనాల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అల్లరి నరేష్. అసలు అల్లరి నరేష్ సినిమాలు ఏం బాగుంటాయ్రా అనే సినీ ప్రియుడు లేడంటే అతిశయోక్తి కాదు.
ఆయన ప్రతీ సినిమా కనీసం ఒక్కసారైనా చూసేలానే ఉంటాయి. అంతేకాదు ప్రతీ ఏడాది రెండు, మూడు రిలీజ్లు పక్కాగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుండేవాడు. అయితే సినిమాలు చేస్తున్నాడు కానీ.. కమర్షియల్ బ్లాక్ బస్టర్లు మాత్రం కొట్టడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా ఏదో తెలియని ఒక డిస్ సాటిస్ఫాక్షన్. దాంతో తనను తానూ మర్చుకుంటూ నాంది అంటూ కొత్త రూటుకు నాంది పలికాడు. అసలు అల్లరి నరేష్ యేనా ఇలాంటి కథ ఎంచుకుంది అనే రేంజ్లో నాంది సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో అల్లరి నరేష్‌ను వరించింది. అప్పటి వరకు కమెడియన్‌గా అల్లరి నరేష్‌ను చూసిన మనకు.. యాక్షన్ రోల్స్ కూడా అదరగొడతాడు అనే రేంజ్‌తో యాక్టింగ్ కుమ్మేశాడు.
ఆ తర్వాత అదే ఫ్లోలో వెళ్తాడనుకుంటే.. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పలకరించాయి. ప్రస్తుతం ఈ హీరో ఓ సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ లైనప్‌లో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో రంభ ఊర్వశి మేనక సినిమా ఒకటి. చంద్రమోహన్ చింటాడా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే మేకర్స్ అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు.
కాగా.. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. నా కంటి మీద కునేకే అంటూ క్రేజీ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. భాస్కర్ భట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను ధనుంజయ్ ఆలపించాడు. చైతన్ భరద్వాజ్ స్వర పరిచిన ఈ పాటకు జీతూ మాస్టర్ కొరియోగ్రఫి అందించాడు. మరీ ముఖ్యంగా ఈ పాటలో లొకేషన్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, హస్య సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సురభి హీరోయిన్గా నటిస్తుంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














