Last Updated:
అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ అప్‌డేట్ వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka). భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇది మరో గేమ్ ఛేంజింగ్ సినిమా కానుందనే టాక్ అయితే ఉంది. ‘పుష్ప’ సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్, ‘జవాన్’తో ఏకంగా వెయ్యి కోట్ల బాక్సాఫీస్ మార్క్‌ను అందుకున్న అట్లీ కలయికలో వస్తున్న ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు, బన్నీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే మేకర్స్ ఎప్పటికప్పుడు క్రేజీ అప్‌డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలపై ఒక బిగ్ లీక్ బయటకు వచ్చింది. రీసెంట్‌గా జరిగిన ‘సిగ్మా’ మూవీ ఈవెంట్‌లో దర్శకుడు సిబి మాట్లాడుతూ ‘రాకా’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను ఇప్పటికే ‘రాకా’ గ్లింప్స్ విజువల్స్ చూశానని, అవి ఊహకు అందనంత అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అట్లీ సృష్టించిన ఆ సరికొత్త మాస్ ప్రపంచాన్ని ఇంకో మూడు రోజుల్లో మీరంతా కనులారా చూడబోతున్నారని ఆయన లీక్ ఇవ్వడంతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సిబి చేసిన ఈ కామెంట్స్‌తో గ్లింప్స్ రాకపై ఫ్యాన్స్‌లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. సెప్టెంబర్ 21న దర్శకుడు అట్లీ పుట్టినరోజు కావడంతో, సరిగ్గా అదే రోజున మేకర్స్ ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్‌ను బహుమతిగా విడుదల చేయడం దాదాపు ఖరారైంది. గతంలో మేకర్స్ వదిలిన ‘37’ (3×7=21) అనే క్రైప్టిక్ పోస్టర్ కూడా సెప్టెంబర్ 21 తేదీనే సూచిస్తోందని అభిమానులు ముందే అంచనా వేశారు. ఇప్పుడు సిబి వ్యాఖ్యలతో ఆ ఫ్యాన్ థియరీ నిజమైందని తేలిపోయింది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అట్లీ మార్క్ మాస్ యాక్షన్ ఎలివేషన్స్, అల్లు అర్జున్ స్వాగ్, సెన్సేషనల్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ గ్లింప్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు.














