Amazon Data center: తెలంగాణ ఐటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డీల్.. రూ.60,000 కోట్ల అమెజాన్ ప్రాజెక్టుకు నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన! | తెలంగాణ వార్తలు | ACTPnews

రేవంత్ రెడ్డి


Last Updated:

Amazon Data center: తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ టెక్ దిగ్గజం ‘అమెజాన్’ (Amazon) సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన హైపర్‌స్కేల్ డేటా సెంటర్ (Hyperscale Data Centre) ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, బహుళజాతి సంస్థలు (MNCs) తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి తెలంగాణను అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఎంచుకుంటున్నాయి.

దావోస్ సదస్సు నుంచి క్షేత్రస్థాయి వరకు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సాంకేతిక పెట్టుబడులలో ఒకటిగా నిలిచిన ఈ ప్రాజెక్టు వెనుక ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అమెజాన్ యాజమాన్యంతో జరిపిన కీలక చర్చల ఫలితంగా, రాష్ట్రంలో రూ. 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సదరు సంస్థ ప్రాథమికంగా అంగీకరించింది.

ఒప్పందం (డిసెంబర్ 2025)

ఆ తర్వాత జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ వేదికగా ఈ భారీ పెట్టుబడికి సంబంధించిన అధికారిక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై ఇరు వర్గాలు సంతకాలు చేశాయి. ఈ మెగా ప్రాజెక్టు విస్తరణ కోసం ప్రభుత్వం అమెజాన్ సంస్థకు భూములను కేటాయించింది. ఇక్కడ కంపెనీకి 202 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక్కడే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఇది పూర్తయితే భారతదేశంలోనే అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనుంది. చందన్వెల్లి: ఇక్కడ అదనంగా మరో 98 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది.

ఈ భారీ పెట్టుబడిని ఆకర్షించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం అమెజాన్ సంస్థకు దాదాపు రూ. 125 కోట్ల విలువైన రాయితీలు, ప్రోత్సాహకాలను పొడిగించింది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టును దశలవారీగా నిర్మిస్తారు. మొదటి దశ నిర్మాణాన్ని రాబోయే 24 నెలల్లో (రెండు ఏళ్లలో) పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన విస్తరణ పనులను రాబోయే పదేళ్ల కాలంలో పూర్తి చేస్తారు. పదేళ్ల వ్యవధిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) చేసే మొత్తం పెట్టుబడి విలువ రూ. 60,000 కోట్లకు చేరుకుంటుంది.

డిజిటల్ విప్లవానికి ఊతం

హైదరాబాద్ శివార్లలో (Peri-Urban Region) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు స్థానిక ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడనుంది. ఈ అత్యాధునిక డేటా సెంటర్ల ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్, హెల్త్‌కేర్, ప్రభుత్వ డిజిటల్ సేవలు, స్టార్టప్‌లకు అవసరమైన పటిష్టమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. తెలంగాణ ఐటీ రంగ చరిత్రలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవబోతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed