Ananya Goli: తెలుగు అమ్మాయికి అమెరికాలో ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అనన్య గోలి సరికొత్త రికార్డు! | | ACTPnews

అనన్య గోలి


Last Updated:

అమెరికాలో అందించే ప్రతిష్ఠాత్మక ‘మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్’ అవార్డులలో భాగంగా అనన్య ‘స్టేట్ హానరబుల్ మెన్షన్’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది.

అనన్య గోలి
అనన్య గోలి

Ananya Goli: అమెరికాలో చదువుకుంటున్న తెలుగు అమ్మాయి అనన్య గోలి సరికొత్త రికార్డు సృష్టించి, తెలుగు జాతి గర్వపడేలా చేసింది. కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ రంగాలలో అత్యంత ప్రతిభ కనబర్చే వారికి ఏటా అమెరికాలో అందించే ప్రతిష్ఠాత్మక ‘మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్’ అవార్డులలో భాగంగా అనన్య ‘స్టేట్ హానరబుల్ మెన్షన్’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది.

ఈనాడు కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గోలి కృష్ణ చైతన్య, సంపా సిన్హా దంపతులు 2014లోనే అమెరికాకు వలసవెళ్లి, అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. వీరి కుమార్తె అయిన అనన్య ప్రస్తుతం అమెరికాలోని ప్రసిద్ధ ఈడెన్ ప్రైరీ హైస్కూల్‌లో సోఫోమోర్ సెకండియర్ (మనదేశంలోని పదో తరగతితో సమానం) చదువుతోంది.

చిన్న వయసులోనే సాంకేతిక మరియు కంప్యూటర్ రంగంపై అపారమైన పట్టు సాధించిన అనన్య, ఈ విభాగంలో అద్భుతమైన లీడర్‌షిప్ నైపుణ్యాలను (నాయకత్వ లక్షణాలను) ప్రదర్శించింది. ఆమె ప్రతిభను, సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించిన కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకొని, తోటి విద్యార్థులకు అనన్య గోలి ఆదర్శంగా నిలిచింది. ఈ విషయం తెలియడంతో సత్తెనపల్లిలోని ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports