Asian Games 2026: భారత మహిళల హాకీ జట్టు చారిత్రక విజయం.. 44 ఏళ్ల తర్వాత స్వర్ణం.. 2028 ఒలింపిక్స్‌కు అర్హత! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఆసియా క్రీడలు 2026 మహిళల హాకీ ఫైనల్లో భారత్ 1-0 తేడాతో చైనాను ఓడించి బంగారు పతకం సాధించింది. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నేరుగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత దక్కించుకుంది.

News18
News18

ఆసియా క్రీడలు 2026 మహిళల హాకీ పోటీల్లో భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం జరిగిన తుది పోరులో బలమైన చైనా జట్టును 1-0 గోల్ తేడాతో మట్టికరిపించి భారత అమ్మాయిలు పసిడి పతకాన్ని ముద్దాడారు. చివరిసారిగా 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు స్వర్ణం గెలవగా, మళ్లీ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఆ ఘనత పునరావృతమైంది. మ్యాచ్ మొదటి క్వార్టర్‌లోనే లాల్‌రెమ్‌సియామి అద్భుత ఫీల్డ్ గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. రెండో క్వార్టర్‌లో చైనాకు లభించిన పెనాల్టీ స్ట్రోక్‌‌ను భారత అనుభవజ్ఞురాలైన గోల్‌కీపర్ సవితా పూనియా అత్యద్భుతంగా అడ్డుకుని ప్రత్యర్థికి గోల్ సమం చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ అద్భుత విజయంతో భారత జట్టు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్ క్రీడలకు నేరుగా బెర్తు ఖరారు చేసుకుంది.

పటిష్ట రక్షణ శ్రేణితో విజయం ఖాయం

మొదటి అర్ధభాగంలో లభించిన 1-0 ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత క్రీడాకారిణులు రక్షణ విభాగంలో అద్భుత పోరాటం కనబరిచారు. పారిస్ ఒలింపిక్స్‌‌లో రజతం గెలిచిన చైనా ఆటగాళ్లు గోల్ కోసం చివరి వరకు తీవ్రంగా దాడి చేసినప్పటికీ భారత రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయారు. పూనియా పర్యవేక్షణలోని డిఫెన్స్ విభాగం చైనా వ్యూహాలను సమర్థంగా తిప్పికొట్టింది.

గతంలో 1998 బ్యాంకాక్, 2018 జకార్తా ఆసియా క్రీడల్లో ఫైనల్ వరకు చేరిన భారత్ రన్నరప్‌గా రజత పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా విజయంతో ఆ పాత చేదు జ్ఞాపకాలను చెరిపివేసి భారత మహిళలు ఆసియా ఛాంపియన్లుగా అవతరించారు.

ఓటమి పాలైన చైనాకు రజత పతకం దక్కగా, కాంస్య పతక పోరులో దక్షిణ కొరియాపై షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచిన ఆతిథ్య జపాన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత ప్రదర్శనతో భారత మహిళల జట్టు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

EDITION HOST CITY GOLD SILVER BRONZE
1982 New Delhi (India) India South Korea Malaysia
1986 Seoul (South Korea) South Korea Japan India
1990 Beijing (China) South Korea China Japan
1994 Hiroshima (Japan) South Korea Japan China
1998 Bangkok (Thailand) South Korea India China
2002 Busan (South Korea) China South Korea Japan
2006 Doha (Qatar) China Japan India
2010 Guangzhou (China) China South Korea Japan
2014 Incheon (South Korea) South Korea China India
2018 Jakarta-Palembang (Indonesia) Japan India China
2022 Hangzhou (China) China South Korea India
2026 Aichi-Nagoya (Japan) India China Japan



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports