Last Updated:
‘అవతార్’ ఫ్రాంచైజీకి ఆల్ ఓవర్ వరల్డ్‌లో కోట్లల్లో అభిమానులున్నారు. అసలు చాలా మంచి 90స్ కిడ్స్ ఇంగ్లీష్ సినిమాలు చూడటం స్టార్ట్ చేసిందే అవతార్ సినిమాతో. అంతలా ఇంపాక్ట్ చూపించింది ఈ సినిమా.
‘అవతార్’ ఫ్రాంచైజీకి ఆల్ ఓవర్ వరల్డ్‌లో కోట్లల్లో అభిమానులున్నారు. అసలు చాలా మంచి 90స్ కిడ్స్ ఇంగ్లీష్ సినిమాలు చూడటం స్టార్ట్ చేసిందే అవతార్ సినిమాతో. అంతలా ఇంపాక్ట్ చూపించింది ఈ సినిమా. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీలో మూడు పార్ట్‌లు రాగా.. ఫస్ట్ పార్ట్ ప్రపంచ రికార్డులు తిరగరాసింది. సెకండ్ పార్ట్ కూడా బీభత్సమైన కలెక్షన్లు రాబట్టింది.
అయితే.. ‘అవతార్-3’ మాత్రం ఊహించిన స్థాయిలో హిట్టు కొట్టలేకపోయింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ గతేడాది డిసెంబర్‌లో రిలీజైంది. మరీ ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. డీసెంట్ హిట్టు అందుకుంది. ఈ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ వల్ల ఈజీగానే గట్టెక్కింది కానీ.. అవతార్ 1,2 రెండు పార్టులు చూపించిన ఇంపాక్ట్.. అవతార్ 3 మాత్రం చూపించలేకపోయింది. నిజానికి ఇండియాలో కూడా ఫస్ట్, సెకండ్ పార్టులు బీభత్సమైన కలెక్షన్లు రాబట్టాయి. కానీ.. థర్డ్ పార్ట్ మాత్రం సో సోగానే ఆడేసింది.
ఇక ఇదిలా ఉంటే అవతార్-3 ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా జూన్ 24న జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ సినిమా దాదాపు రూ.3000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్‌లో రూ.14వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. నిజానికి ఈ ఫ్రాంచైజీలో ఫస్ట్ పార్ట్ రూ.15 వేల కోట్లు.. సెకండ్ పార్టు రూ.18 వేల కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే అవతార్ 3 తక్కువ కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. రెండో భాగం చివరలో జరిగిన యుద్ధం సల్లీ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. తమ పెద్ద కొడుకు నెటెయమ్ మరణాన్ని జేక్ సల్లీ, నేతిరి జీర్ణించుకోలేకపోతారు. ఆ బాధ వారిని నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. మిగిలిన పిల్లలైన కిరి, లోక్, టూక్ రక్షణ ఇప్పుడు జేక్ సల్లీ బాధ్యత. అయితే, తన అన్న మరణానికి తానే కారణమనే అపరాధ భావం (Guilt) లోక్‌ను మానసికంగా కుంగదీస్తుంది. ఈ క్రమంలోనే దత్తపుత్రుడు స్పైడర్ కూడా వారితోనే ఉంటాడు. స్పైడర్ తన తండ్రి క్వారిచ్‌ను రక్షించిన విషయం సల్లీ కుటుంబానికి తెలిస్తే ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఈ భాగంలో హైలైట్ కానుంది.
మరోవైపు, చావును జయించిన కల్నల్ క్వారిచ్ ఇప్పుడు నావీ రూపంలోనే తన ప్రతీకారాన్ని రగిలించుకుంటున్నాడు. ఈసారి అతడు ఒంటరిగా యుద్ధం చేయడం లేదు. పండోరాలోని అత్యంత క్రూరమైన, హింసాత్మకమైన తెగగా పేరొందిన ‘అగ్ని తెగ’ (Ash People) అండ అతడికి దొరుకుతుంది. ఈ తెగ నాయకురాలు వరంగ్ ఈ కథలో ప్రధాన విలన్. ప్రకృతిని ప్రేమించే మిగతా నావీ తెగలకు భిన్నంగా, వరంగ్ మనస్తత్వం చాలా విధ్వంసకరంగా ఉంటుంది.
వరంగ్‌కు పండోరా ప్రకృతి దేవత ‘ఈవా’ అంటే అమితమైన ద్వేషం. సల్లీ కుటుంబం విశ్వసించే సిద్ధాంతాలకు ఆమె పూర్తిగా వ్యతిరేకం. ఈ ద్వేషాన్ని కల్నల్ క్వారిచ్ తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. మానవుల దగ్గర ఉండే అత్యాధునిక ఆయుధాలను, యుద్ధ తంత్రాలను వరంగ్‌కు క్వారిచ్ నేర్పిస్తాడు. ప్రాచీన తెగ బలం, ఆధునిక ఆయుధాల మేళవింపుతో వీరు జేక్ సల్లీ సామ్రాజ్యంపై దాడికి సిద్ధమవుతారు.
పండోరా వనరులను కొల్లగొట్టాలనే లక్ష్యంతో ఉన్న ఆర్డీఏ (RDA) బృందం ఈసారి మరింత శక్తివంతంగా మారుతుంది. క్వారిచ్, వరంగ్ ద్వయానికి వీరు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారు. నీటి తెగ, అడవి తెగలను నాశనం చేసి పండోరాను తమ వశం చేసుకోవాలని చూస్తారు. ముగ్గురు బలమైన శత్రువులను జేక్ సల్లీ ఎలా ఎదుర్కొంటాడు? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతడు చేసే సాహసాలు ఏమిటి? అసలు అగ్ని తెగకు ఈవా దేవతపై అంత కోపం ఎందుకు? అనే అంశాలు తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













