Last Updated:
Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరోవైపు ఈకేసులో బండి సంజయ్‌ది ముమ్మాటికి తప్పేనని..అతడ్ని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు.
Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరోవైపు ఈకేసులో బండి సంజయ్‌ది ముమ్మాటికి తప్పేనని..అతడ్ని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు ఆయన్ని విచారించడానికి వెళితే ఆచూకి దొరకలేదని.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందని POCSO కేసు విచారణ అధికారి రితిరాజ్ మీడియాకు వెల్లడించారు. ఇక ఈకేసులో నిందితురాలి స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశామని.. ఈకేసులో ఇంకా అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ గురించి సేకరిస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు ఇదే అంశంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం సంచలన కామెంట్స్ చేశారు. తప్పు చేస్తే బండి సంజయ్ కుమారుడైనా తన కుమారుడైనా శిక్షించాల్సిందేనంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనెల 8న కేసు నమోదు అయితే ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం డీజీపీని ఆదేశించిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేశారు అధికారులు.
బండి భగీరథ్ .. ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ పార్టీల నేతల దగ్గర నుండి సోషల్ మీడియాలో విస్తృతంగా విమర్శలు ఎదుర్కొంటున్న పేరు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడే బండి భగీరథ్. గత కొద్దిరోజుల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లుగా ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదుతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. ఈకేసులో కేంద్రమంత్రి కొడుకుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వచ్చిన విమర్శలు, ఒత్తిడితో పోలీసులు విచారణ కోసం సిట్ వేశారు. ఇందులో భాగంగానే కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ని ఈపోక్సో కేసు విచారణ అధికారిణిగా నియమించారు.ఆమె విచారణ కోసం పేట్ బాషీరాబాద్ పీఎస్‌కు చేరుకున్నారు. అక్కడ బాధితురాలి పేరెంట్స్ ఇచ్చిన సాక్ష్యాధారాలతో పాటు మిగిలిన కాల్ రికార్డ్స్, ఫోటోలు, వీడియోలను సేకరించినట్లుగా తెలిపారు. అంతే కాదు ఈకేసులో ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేసినట్లుగా రితిరాజ్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుందన్నారు.
నిన్నటి వరకు ఈకేసులో ఎలాంటి కదలికలు లేకపోవడంతో దర్జాగా తిరిగిన బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాదు అతడ్ని కాంటాక్ట్ చేయడానికి ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోందని తెలిపారు. కనిపించకుండా పోయిన భగీరథ్ కోసం వెదుకుతున్నామని అతని CDR పరిశీలిస్తుస్తున్నామని తెలిపారు పోలీసులు.
ఈకేసులో ఇప్పటి వరకు భగీరథ్ తప్పు చేసినట్లుగా కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాని తాజాగా ఓ వీడియో మరింత వైరల్ అవుతోంది. బండి భగీరథ్ మీద చేసిన ఆరోపణలు నిజం కాదనడానికి ఆధారం ఇదేనంటూ ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో భగీరథ్ బెడ్ పై పడుకుంటే ఓ యువతి అతనికి ఏదో తినిపిస్తోంది.
బండి భగీరథ మీద చేసిన ఆరోపణలు నిజం కాదు అనడానికి ఆధారం..👇
_ ఆ అమ్మాయి డిసెంబర్ 31 అర్ధరాత్రి రోజు అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పింది స్టెషన్ లో. ఎంక్వైరీ చేయగా అదే రోజు అర్ధరాత్రి 2: 36 సమయంలో భగీరథ కి తినిపిస్తున్నట్టు వీడియో proof దొరికింది.
దీన్ని బట్టి అర్థం… pic.twitter.com/yTVblR5Mok
— NK Yadav (@NKYadav_BJP) May 11, 2026
ఆ అమ్మాయి డిసెంబర్ 31 అర్ధరాత్రి రోజున బండి సంజయ్ కుమారుడు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్టేషన్‌లో చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి కౌంటర్‌గానే ఎంక్వైరీ చేస్తే అదే రోజు అర్ధరాత్రి 2: 36 సమయంలో భగీరథకి తినిపిస్తున్నట్టు వీడియో ప్రూఫ్ దొరికిందని ఇదంతా బండి సంజయ్ పరువు తీయడానికి, అతని కుమారుడ్ని జైలుపాలు చేయడానికి చేస్తున్న కుట్రేనంటూ కొందరు సమర్దిస్తున్నారు. దీన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం సమర్థిస్తున్నారు.
తన కుమార్తెను బండి భగీరథ్ వేధిస్తున్నారంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఈనెల 8న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు సెక్షన్ 11 రెడ్‌విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్, బీఎన్ఎస్ 74, 75 సెక్షన్ల క్రింద శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. మరోవైపు, బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని శుక్రవారమే భగీరథ్ కరీంనగర్ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించడం, సిట్ వేయడంతో ఈకేసు విచారణ వేగంగా జరుగుతోంది.
Hyderabad,Telangana
May 12, 2026 10:35 AM IST













