Last Updated:
టాలీవుడ్‌లో బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన గారాల పట్టి జనని వివాహం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఇవాళ (ఆగస్టు 16, 2026) హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’, ‘బాద్‌షా’, ‘టెంపర్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన గారాల పట్టి జనని వివాహం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఇవాళ (ఆగస్టు 16, 2026) హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుక మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కోలాహలంగా సాగింది. బండ్ల గణేష్ కుమార్తె పెళ్లికి టాలీవుడ్ తారలతో పాటు రాజకీయ ఉద్దండులు భారీగా తరలివచ్చారు.














