Last Updated:
BCCI: దేశవాళీ క్రికెట్‌లో క్రమశిక్షణ, అవినీతి నిరోధక నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) టోర్నీ సందర్భంగా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినందుకు గాను ఒక యువ తమిళనాడు బ్యాటర్‌కు బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం రూ. 1 లక్ష రూపాయల భారీ జరిమానా విధించింది. మ్యాచ్ సాగుతున్న సమయంలో క్రీడాకారులు కేటాయించిన ప్రత్యేక పరిధిలో నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించారనే అభియోగంపై ఈ క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.














