Bharathiraja: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి. 85 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.

News18
News18

తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి. 85 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. ఇతడు దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. కేవలం కెమెరా వెనుక మాత్రమే కాదు.. నటుడిగానూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. తన కెరీర్‌లో 6 జాతీయ అవార్డులు, పద్మశ్రీ పురస్కారంతో పాటు అనేక గౌరవాలను అందుకున్నారు.

అప్పటివరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను బయటకు తీసుకువచ్చి పల్లెటూరి పచ్చదనాన్ని, మట్టి వాసనను ప్రేక్షకులకు పరిచయం చేశారు భారతీ రాజా. దిగ్గజ స్టార్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు.. రాధిక, రేవతి వంటి హీరోయిన్లను సినీ లోకానికి పరిచయం చేసింది ఆయనే. దాదాపు 40 సినిమాలకు దర్శకత్వం వహించిన భారతీ రాజా, తమిళ సినీ పరిశ్రమలో ‘ఇయక్కునర్ ఇమయం’ అంటే దర్శకత్వ శిఖరం అనే ఘనమైన బిరుదును సంపాదించుకున్నారు. నటుడిగా కూడా సత్తా చాటిన భారతీరాజా.. మణిరత్నం చిత్రం ఆయుధ ఎళుతు, పాండియనాడు, ఈశ్వరన్, తిరుచిత్రంబలమ్, విజయ్ సేతుపతి మైల్‌స్టోన్ చిత్రం మహారాజా లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు.

గతేడాది ఆయన కుమారుడు మనోజ్ ఆకస్మిక మరణం చెందారు. ఇప్పుడు భారతీరాజా కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారతీ రాజా మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed