పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశ పోలింగ్ వేళ భవానీపూర్ రణరంగంగా మారింది. బుధవారం ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఒక పోలింగ్ బూత్ను సందర్శిస్తున్న సమయంలో టీఎంసీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు టీఎంసీ శ్రేణులపై ఎదురుదాడికి దిగి, వారిని వీధుల్లో పరిగెత్తించారు. ఈ ఘర్షణలతో భవానీపూర్ గల్లీల్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. టీఎంసీ కార్యకర్తలను ‘బయటి వ్యక్తులు’గా అభివర్ణించిన సువేందు, వారు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం అక్కడ భారీగా కేంద్ర బలగాలను మోహరించింది.
Source link
Bhawanipur Clash: టీఎంసీ కార్యకర్తలను పరిగెత్తించిన సువేందు #shorts | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










