Bigg Boss: అగ్నిపరీక్షకు అలాంటి వాళ్లు రావొద్దన్న నవదీప్.. బిగ్‌బాస్ సెలక్షన్స్‌లోనే ఊహించని ట్విస్ట్ | ట్రెండింగ్ | ACTPnews

Bigg Boss


Last Updated:

Bigg Boss: ప్రతీ ఒక్కరూ ఏదో విధంగా పాపులర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దని పాకులాడుతున్నారు. ఈక్రమంలోనే తమకు నిరాశ ఎదురైతే భరించలేకపోతున్నారు. బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో సెలక్షన్స్‌లో కూడా అలాంటి సిస్ట్యూవేషన్‌ ఉంది. అందుకే హీరో నవదీప్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

Bigg Boss
Bigg Boss

Bigg Boss: సోషల్ మీడియాలో తమకున్న కాస్తో కూస్తూ ఫాలోయింగ్‌ని మరింత పెంచుకునేందుకు చాలా మంది బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షోని వేదిగా మార్చుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇందుకోసం మా టీవీ యాజమాన్యం అగ్నిపరీక్ష పేరుతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్‌లను సెలక్ట్ చేస్తోంది. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్, జనరల్ పబ్లిక్ రెండుగా విభజించి సెలక్షన్ కోసం జడ్జీలను నియమించింది. ఈక్రమంలోనే అగ్నిపరీక్షకు సోషల్ మీడియాలో బాగా సుపరిచితమైన వ్యక్తి ఉప్పల్ బాలు వెళ్తే అక్కడ జడ్జీగా ఉన్న వారిలో నటుడు నవదీప్ రిజక్ట్ చేయడం పెద్ద దుమారం రేపింది. నవదీప్‌ తనను హౌస్‌లోకి రాకుండా అడ్డు పడటమే కాకుండా తనను వ్యక్తిగతంగా, మానసీకంగా అవమానపరిచాడని ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ షేర్ చేశాడు. అంతే కాదు భవిష్యత్తులో తనకు ఏదైనా అయినా, తన చావుకి కారణం నవదీపే అంటూ బాలు పోస్ట్‌తో హీరో నవదీవ్ రియాక్ట్ అయ్యాడు. బిగ్‌బాస్ షో కోసం నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్‌తో పాటు జడ్జీలకు కూడా సవాల్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports