Last Updated:
తెలుగు బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు.
తెలుగు బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం ద్వారా కామనర్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకుమారి చెప్పిన జీవిత కథ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.














