Bigg Boss 10 Telugu: ఈ సారి డబుల్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి బయటకొచ్చేది ఆ ఇద్దరే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఇప్పటికే విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 10 రియాలిటీ షో, ఇప్పుడు నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్‌కు సిద్ధమైంది.

News18
News18

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో, అంచనాలకు మించిన ట్విస్టులతో ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. హౌస్‌‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎమోషన్స్, టాస్క్‌లు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్‌కు సిద్ధమైంది. దీంతో ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

గత వారాల ఎలిమినేషన్స్ పరిశీలిస్తే.. మొదటి వారం చైత్ర, రెండవ వారం ప్రముఖ నటుడు కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారంలో ముఖేష్ చేసిన ఊహించని త్యాగం కారణంగా ఎలిమినేషన్ ప్రక్రియ రద్దయింది. గత వారం ఎలిమినేషన్ లేకపోవడంతో, ఈ నాలుగో వారంలో బిగ్ బాస్ ‘డబుల్ ఎలిమినేషన్’ అస్త్రం ప్రయోగించనున్నట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు (ముఖేష్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి) ఉన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే.. స్టార్ కంటెస్టెంట్ త్రిగుణ్ భారీ ఓట్లతో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు. గత వారంతో పోలిస్తే అతనికి ప్రేక్షకుల మద్దతు అమాంతం పెరిగింది. ఆ తర్వాత 13.17 శాతం ఓటింగ్‌తో రోహిత్ రెండవ స్థానంలో నిలిచాడు. ఇక హౌస్‌లో ఎంతో నిలకడగా ఆడుతూ, తనదైన మాట తీరుతో ఆకట్టుకుంటున్న సీరియల్ నటుడు ముఖేష్ కు ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగింది. మొన్నటివరకు ఐదో స్థానంలో ఉన్న ముఖేష్ ఏకంగా మూడో స్థానానికి ఎగబాకాడు. వీరి తర్వాత జబర్దస్త్ నరేష్ నాలుగో స్థానంలో ఉండగా.. అమన్ మసూద్ ఐదో స్థానంలో, షాలిని ఆరవ స్థానంలో, దేబ్జానీ ఏడవ స్థానంలో నిలిచి సేఫ్ జోన్‌లో కొనసాగుతున్నారు.

అయితే, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న చరణ్, సృష్టి పరిస్థితి మాత్రం పూర్తిగా డేంజర్ జోన్‌లో పడింది. నిజానికి రెండవ వారమే సృష్టి ఎలిమినేట్ కావాల్సి ఉన్నా, తృటిలో తప్పించుకుంది. సుధీర్ పట్ల ఆమె ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌‌కు దారి తీశాయి. దీంతో ఈ వారం సృష్టి ఎలిమినేషన్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక చరణ్ విషయానికొస్తే.. మొదటి వారం మిడ్-వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లి, మళ్లీ రీ-ఎంట్రీ ద్వారా రెండో అవకాశం దక్కించుకున్నాడు. కానీ ఆటపై దృష్టి పెట్టకుండా, ఝాన్సీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అతనికి తీవ్ర నెగెటివిటీని తెచ్చిపెట్టాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే సృష్టితో పాటు చరణ్ కూడా మూటాముల్లె సర్దుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports