Bigg Boss 10 Telugu: వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సర్వం సిద్ధం.. హౌస్‌లోకి వచ్చేది ఎవరో తెలుసా? ఆటలో అసలు మజా ఇప్పుడే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారానికి చేరుకోవడంతో హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఐదో వారం అంటేనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు కేరాఫ్ అడ్రస్. ఈ సీజన్‌లో కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ నిర్వాహకులు భారీ స్కెచ్ వేశారు.

News18
News18

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారానికి చేరుకోవడంతో హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా బిగ్ బాస్ చరిత్రలో ఐదో వారం అంటేనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు కేరాఫ్ అడ్రస్. ఈ సీజన్‌లో కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ నిర్వాహకులు భారీ స్కెచ్ వేశారు. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు తమ ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తుండగా.. ఈ వారం ఏకంగా 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో నిలిచారు. అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలిని, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్ నామినేట్ అయిన వారిలో ఉన్నారు.

అయితే, ఈ వీకెండ్‌లో ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇస్తూ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది. ఒకేసారి ఇద్దరిని సాగనంపి, ఆ స్థానంలో బలమైన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు టీవీ నటుడు శివకుమార్. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని ఫినాలే వరకు చేరుకున్న సీరియల్ నటి ప్రియాంక ప్రియుడిగా శివకుమార్‌కు మంచి గుర్తింపు ఉంది. వాస్తవానికి సీజన్ ప్రారంభంలోనే అతడు ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు తను నటిస్తున్న ‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి తప్పుకోవడంతో శివకుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపు ఖాయమైందని టెలివిజన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇక మరో ఆసక్తికరమైన పేరు నీతు. తెలుగు రియాలిటీ షోల ద్వారా, ముఖ్యంగా బిగ్ బాస్ 5, ఓటీటీ సీజన్లలో తనదైన దూకుడు చూపించిన కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ భార్యే ఈ నీతు. భర్త ఆశయాన్ని నెరవేర్చేందుకు ఆమె 10వ సీజన్‌లోకి అడుగుపెట్టనుందని సమాచారం. ఇప్పటికే ఆమె పేరును బిగ్ బాస్ టీమ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా పాపులర్ అయిన శ్రీకాకుళం కుర్రాడు ‘నవరసాలు రామకృష్ణ’ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నాడు. గతంలో మిథిలేశ్, అపూర్వతో కలిసి టాస్క్ ఆడి ఓడిపోయిన రామకృష్ణ.. ఇప్పుడు నేరుగా హౌస్‌లోకి అడుగుపెట్టి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

వీరితో పాటు మరికొన్ని ప్రముఖ పేర్లు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ 8వ సీజన్ విజేత నిఖిల్ మాజీ ప్రియురాలు కావ్యశ్రీ, పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ఫేమ్ నూకరాజు, రాకింగ్ రాకేశ్ పేర్లు వైల్డ్ కార్డ్ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. హౌస్‌లో ఇప్పటికే గ్రూపులు, గొడవలతో వాతావరణం వేడెక్కగా.. ఇప్పుడు ఈ కొత్త కంటెస్టెంట్ల రాకతో ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. హౌస్‌లో ఉన్న పాత కంటెస్టెంట్లకు వీరు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. వీరిలో ఫైనల్ గా ఎంతమంది హౌస్‌లోకి వెళ్తారు, ఆటను ఏ మలుపు తిప్పుతారు అనేది ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో తేలిపోనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed