Last Updated:
బిగ్ బాస్ 10 షో ప్రారంభానికి ముందే బోలెడన్ని వివాదాలు చూస్తున్నాం. రీసెంట్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష జడ్జీలపై విరుచుకుపడిన ఉప్పల్ బాలు.. తాజాగా యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది.
తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ సెప్టెంబర్ మొదటి వారంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. గతేడాది లాగే ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు (కామనర్స్‌కు) హౌస్‌లో అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ‘బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2’లో ఇప్పటికే 15 మంది ఫైనలిస్టులను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఆడిషన్స్ దశలోనే ఊహించని వివాదాలు తెరపైకి వస్తున్నాయి.














