Bomb Blast In Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. ప్యాసింజర్ రైలుపై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి, 47 మందికి తీవ్ర గాయాలు | | ACTPnews

బాంబ్ బ్లాస్ట్


Last Updated:

బలోచిస్తాన్ రాజధాని క్వెట్టా నగరంలోని చమన్ ఫాటక్ సమీపంలో క్యాంట్ వైపు వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వాహన శ్రేణితో కూడిన ఘోర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

బాంబ్ బ్లాస్ట్
బాంబ్ బ్లాస్ట్

Bomb Blast In Pakistan: పాకిస్తాన్‌లోని అశాంత బలోచిస్తాన్ ప్రాంతంలో మరోసారి ఉగ్రవాదులు ఘోర రక్తాపాతం సృష్టించారు. బలోచిస్తాన్ రాజధాని క్వెట్టా నగరంలోని చమన్ ఫాటక్ సమీపంలో క్యాంట్ వైపు వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వాహన శ్రేణితో కూడిన ఘోర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ భయానక పేలుడు ధాటికి కనీసం 23 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

భద్రతా దళాల దెబ్బకు ప్రతీకారంగానే ఈ దాడి?

ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనంటూ ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (BLA) కి చెందిన ఉగ్రవాదులపై గట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానిక భద్రతా విభాగం ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది.

“బలోచిస్తాన్ వ్యాప్తంగా పాకిస్తాన్ రక్షణ దళాలు (Security Forces) ఇటీవలి కాలంలో జరిపిన గట్టి నిఘా, ఎదురుకాల్పుల చర్యల వల్ల బీఎల్ఏ (BLA) ఉగ్రవాదులు భారీగా నష్టపోయారు. సైన్యం చేతిలో వరుసగా దెబ్బతిని తీవ్ర నైరాశ్యంలో ఉన్న ఉగ్రవాదులు, తమ ఉనికిని చాటుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికే అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు” అని అధికారిక ప్రకటన పేర్కొంది.

ముమ్మరంగా సహాయక చర్యలు

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర విపత్తు నిర్వహణ బృందాలు, డజన్ల సంఖ్యలో అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పాకిస్తాన్ సైన్యం మరియు పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని దిగ్బంధించాయి.

బోగీలలో చిక్కుకున్న క్షతగాత్రులను వెలికితీసి క్వెట్టాలోని సీఎంహెచ్, ఇతర ప్రధాన ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రైల్వే లైన్ పునరుద్ధరణ పనులను అధికారులు ముమ్మరం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports