Last Updated:
హైదరాబాద్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తించడం, వైద్యులను సంప్రదించడం ద్వారా చికిత్స ఫలి
హైదరాబాద్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారా చికిత్స ఫలితాలను మెరుగుపరచవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
భారత్‌లో మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంతో పాటు.. రొమ్ములో కనిపించే అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా స్క్రీనింగ్‌పై వైద్యుల సలహా తీసుకోవాలని చెప్పారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ నివేద్ రావు బల్మూరి మాట్లాడుతూ.. 40 ఏళ్లు దాటిన మహిళలు వైద్యుల సలహా మేరకు తగిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రొమ్ములో కొత్తగా ఏదైనా మార్పు లేదా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా చికిత్సలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు, ప్రమాద కారకాలు, స్క్రీనింగ్ అవసరం, కుటుంబ చరిత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వైద్య నిపుణులు పాల్గొన్న మహిళలతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంలో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం ప్రాధాన్యతను వివరించారు.
పింక్ అక్టోబర్‌లో భాగంగా అక్టోబర్ 31 వరకు నమోదు చేసుకున్న మహిళలకు ఉచిత ఆంకాలజిస్ట్ కన్సల్టేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అసెస్‌మెంట్, కౌన్సెలింగ్ అందించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచన మేరకు ఉచిత బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ పరీక్ష సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించాయి. అదనంగా ప్రత్యేక ధరల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజీలను అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఈ కార్యక్రమంలో డా. మాధవి డొక్కు, సీనియర్ కన్సల్టెంట్ గైనెక్ ఆంకాలజిస్ట్, డా. నూర్జియా సుల్తానా సయ్యద్, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హీమాటో ఆంకాలజిస్ట్, డా. కె. అభినవ్ కుమార్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఆదరి భార్గవ్, సర్జికల్ ఆంకాలజిస్ట్, సెంటర్ హెడ్ కృష్ణవేణి, మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందస్తు అవగాహన, స్క్రీనింగ్, సమయానికి వైద్య సేవలు తీసుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చని వైద్యులు ఈ సందర్భంగా సూచించారు.














