Last Updated:
BRICS 2026: ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన దౌత్య సంబంధాలకు భారత రాజధాని న్యూఢిల్లీ ప్రధాన వేదికగా మారింది.
సెప్టెంబరు 12, 13 తేదీల్లో భారత్ ఆతిథ్యం ఇస్తున్న 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అంతర్జాతీయ నాయకుల రాకతో దేశ రాజధానిలో సందడి నెలకొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్లతో పాటు గల్ఫ్ దేశాల అగ్రనేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ అగ్రరాజ్యాలు, ప్రధాన కూటములన్నింటితో ఒకేసారి సమాన సంబంధాలు కొనసాగిస్తూ.. భారత్ తన ఆర్థిక, భద్రతా, రవాణా ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే దౌత్య వ్యూహాన్ని చాటుకుంటోంది.














