Last Updated:
టాలీవుడ్లో స్పై డ్రామాలు చాలానే వచ్చినా.. సాధారణ మనుషుల జీవితాల నుంచి గూఢచర్య ప్రపంచంలోకి తీసుకెళ్లే కథలు మాత్రం అరుదుగానే కనిపిస్తాయి. అలాంటి విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమే ‘సీక్రెట్ సోల్జర్’.
టాలీవుడ్లో స్పై డ్రామాలు చాలానే వచ్చినా.. సాధారణ మనుషుల జీవితాల నుంచి గూఢచర్య ప్రపంచంలోకి తీసుకెళ్లే కథలు మాత్రం అరుదుగానే కనిపిస్తాయి. అలాంటి విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమే ‘సీక్రెట్ సోల్జర్’. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. యాక్షన్, థ్రిల్, హ్యూమర్‌తో పాటు స్నేహం, దేశభక్తి వంటి భావోద్వేగాలను కలిపి ఈ సినిమాను రూపొందించినట్లు హీరోలు చెబుతున్నారు. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.














