BRS: కేటీఆర్, హరీష్ రావు‌లకు మరో షాక్.. మహిళా పోలీసులతో అనుచిత ప్రవర్తన.. సైఫాబాద్‌లో మరో కేసు! | తెలంగాణ వార్తలు | ACTPnews

కేటీఆర్, హరీష్ రావు


Last Updated:

BRS: హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై బీఆర్ఎస్ ముఖ్య నేతలపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.

కేటీఆర్, హరీష్ రావు
కేటీఆర్, హరీష్ రావు

అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై బీఆర్ఎస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించడంతో పాటు వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బాధిత మహిళా కానిస్టేబుల్ కె. పద్మావతి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. నిరసనల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మహిళా పోలీసుల పట్ల అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు దూషించి, తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, కొందరు నాయకులు తమ టీషర్టులు విప్పి మహిళా పోలీసుల ఎదుట అర్ధనగ్నంగా నిలబడి, విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులో వివరించారు. ఈ పరిణామాలతో తీవ్ర మానసిక ఆందోళనకు, శారీరక ఇబ్బందులకు గురైన బాధితులకు ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించినట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports