Byreddy Siddharth Reddy | మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

Byreddy Siddharth Reddy | మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు!



కర్నూలు రాజకీయాల్లో వైఎస్సార్సీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఏపీ మంత్రి టీజీ భరత్ను టార్గెట్ చేస్తూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. తనను తిట్టే వారికి, తనపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా బహుమతులు ఇస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. తనకు అసెంబ్లీ టికెట్ రాలేదని మంత్రి అంటున్నారని… “నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది” అంటూ బైరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సతీష్ కుటుంబానికి ఏ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు వచ్చాయో బహిర్గతం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తాను పేరు చెప్పగానే ఆ కంపెనీతో తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ధ్వజమెత్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *