Drishyam 3 First Review: దృశ్యం 3 ఫస్ట్ రివ్యూ.. ఈ సస్పెన్స్ క్రైమ్ డ్రామాలో మతిపోగొట్టే ట్విస్టులు!! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

2013లో విడుదలైన ‘దృశ్యం’ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న కొత్త సినిమా దృశ్యం 3. మే 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో హైలైట్ అయ్యే అంశాలేంటో ఇప్పుడు చూద్దాం..

News18
News18

భారతీయ చలనచిత్ర రంగంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దృశ్యం 3’ (Drishyam 3). ఇప్పుడీ సినిమా విడుదలకు సిద్ధమైంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) నుండి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్:

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు కొన్ని స్వల్ప మార్పులతో ఎటువంటి ప్రధాన కట్స్ లేకుండా ‘UA13+’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. క్రైమ్, మర్డర్ మిస్టరీ, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నందున ఈ సర్టిఫికెట్ ఇచ్చారు. దీని ప్రకారం 13 సంవత్సరాలు నిండిన వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా, అంతకంటే తక్కువ వయస్సు గల వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఈ విషయాన్ని హీరో మోహన్‌లాల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 39 నిమిషాలు (159 నిమిషాలు)గా లాక్ చేశారు. సస్పెన్స్ ఎలిమెంట్స్, స్క్రీన్‌ప్లే ట్విస్టుల కోసం ఈ నిడివి సరైనదేనని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

కథా నేపథ్యం చూస్తే.. సాధారణ కుటుంబానికి చెందిన జార్జ్ కుట్టి (మోహన్ లాల్), అతని భార్య రాణి (మీనా), కూతుళ్లు అంజు (అన్సిబా హాసన్), అను (ఎస్తేర్ అనిల్) చుట్టూనే ఈ మూడో భాగం కూడా తిరగనుంది. గతంలో జరిగిన ఒక అనుకోని హత్య కేసు నుండి చట్టంలోని లోసుగులను వాడుకుంటూ జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, ఈసారి పోలీసుల ఇన్వెస్టిగేషన్ నుండి ఎలా తప్పించుకున్నాడు అనే సస్పెన్స్ క్రైమ్ డ్రామాతో ‘దృశ్యం 3’ తెరకెక్కింది. ఈ చిత్రంలో అల్పా మైనర్ పాత్రల్లో ఆషా శరత్, సిద్దిఖీ, మురళీ గోపి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరంబవూర్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించగా, అనిల్ జాన్సన్ సంగీతం, సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ అందించారు.

2013లో విడుదలైన ‘దృశ్యం’ మొదటి భాగం భారతీయ చిత్రసీమలో ఒక సంచలనం. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు (వెంకటేష్ హీరోగా), తమిళం (కమల్ హాసన్), హిందీ (అజయ్ దేవగన్), కన్నడతో పాటు చైనీస్ భాషలోకి కూడా రీమేక్ చేయబడి ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత 2021లో వచ్చిన ‘దృశ్యం 2’ విడుదలై రికార్డులు సృష్టించింది. ఇప్పుడు థియేటర్లలోకి రాబోతున్న ‘దృశ్యం 3’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డ్ సభ్యుల నుండి సినిమాకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో, జార్జ్ కుట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాను నేరుగా తెలుగులో రిలీజ్ చేయకుండా డబ్బింగ్ వర్షన్ తో విడుదల చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *