Captain Smit Machchhar: ‘నా భర్తపై దాడి వార్త విని తట్టుకోలేకపోయా’.. స్మిత్ మచ్చార్ భార్య సోనాల్ భావోద్వేగం! | | ACTPnews

News18


Last Updated:

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడికి గురైన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ సతీమణి సోనాల్ తొలిసారి స్పందించారు. భర్తపై దాడి విషయం తెలిసినప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, త్వరగా కోలుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.

News18
News18

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఒమన్ కో-పైలట్ జరిపిన ప్రాణాంతక దాడిలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ భయానక ఘటనపై ఆయన సతీమణి సోనాల్ మచ్చార్ న్యూస్18 తో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్తపై విమానం కాక్‌పిట్‌లో దాడి జరిగిందన్న చేదు వార్త మొదట విన్నప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆ విషయాన్ని మానసికంగా ఎలా జీర్ణించుకోవాలో కూడా పాలుపోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన ధైర్యం, భారత ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చిన సమాచారం తనలో ఆందోళనను తగ్గించాయని పేర్కొన్నారు. గురువారం నాడు ఆసుపత్రిలో భర్తను స్వయంగా కలిసిన తర్వాత ఆయన క్షేమంగా ఉన్నారనే నమ్మకం కలిగిందని సోనాల్ వివరించారు.

సరైన వైద్యం అందుతోంది.. త్వరలోనే ఇంటికి!

దుబాయ్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో స్మిత్‌కు అత్యుత్తమ చికిత్స అందుతోందని సోనాల్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడటం, క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకురావడమే తమ కుటుంబం ముందున్న ఏకైక లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తానని ఆమె పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భర్తతో మాట్లాడాలని అనుకుంటున్న విషయంపై స్పందిస్తూ, ఆ నిర్ణయం స్మిత్‌కే వదిలేస్తున్నానని సోనాల్ స్పష్టం చేశారు. నెతన్యాహుతో మాట్లాడేందుకు స్మిత్ సరైన వ్యక్తి అని, ఆయన మానసికంగా, శారీరకంగా పూర్తిగా కోలుకున్న తర్వాత తప్పకుండా మాట్లాడతారని వెల్లడించారు.

విమానంలో ప్రయాణిస్తున్న 174 మంది ప్రాణాలను కాపాడే క్రమంలో ప్రాణాపాయ స్థితిని సైతం లెక్కచేయకుండా పోరాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ సాహసాన్ని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports